NTV Telugu Site icon

Pan India Stars: పూనకాలే… ఒకేసారి నలుగురు పాన్ ఇండియా మొనగాళ్లు!

Pan India Stars

Pan India Stars

వచ్చే సమ్మర్‌లో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు కాబోతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డమ్ అనుభవిస్తున్నారు. ఈ నలుగురు కూడా రెండు, మూడు వారాల గ్యాప్‌లో తమ తమ సినిమాల రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ డైరెక్షన్లో ‘గేమ్ చేంజర్’ మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతానికైతే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దిల్ రాజు 2024 మార్చి సెకండ్ లేదా థర్డ్ వీక్‌లో రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఏప్రిల్‌ 5న యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ‘దేవర’ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే డేట్ లాక్ చేసుకున్నారు.

ఇదే నెలలో అల్లు అర్జున్, సుకుమార్ పాన్ ఇండియా సీక్వెల్ ‘పుష్ప2’ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఏప్రిల్ మంత్ ఎండింగ్‌లో పుష్పరాజ్ థియేటర్లోకి రానున్నాడనేది లేటెస్ట్ అప్డేట్. ఇక ఈ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘కల్కి’ మే నెలలో ఆడియెన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సంక్రాంతికి ‘కల్కి’ రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా మే 9న థియేటర్లోకి రానుందని అంటున్నారు. కాబట్టి, వచ్చే సమ్మర్‌లో మూవీ లవర్స్‌కు పండగేనని చెప్పొచ్చు. బ్యాక్ టు బ్యాక్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్స్‌ థియేటర్లోకి వస్తే, ఆ రచ్చ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నలుగురు దెబ్బకు పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ.

Show comments