Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. సలార్ హిట్ తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుటుంది. ఈ మధ్యనే ప్రభాస్ పై ఒక కీలక షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. ఇక ఈ షెడ్యూల్ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రభాస్.. లండన్ లో కాలికి సర్జరీ చికిత్స తీసుకుంటున్న విషయం తెల్సిందే. షూటింగ్ లో చిన్న గ్యాప్ వచ్చినా కూడా డార్లింగ్ లండన్ వెళ్ళిపోతున్నాడు. ఇక అక్కడ ప్రతిసారి హోటల్స్ లో ఉండలేక.. ప్రభాస్ లండన్ లోనే ఒక అద్దె ఇల్లు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అన్ని సౌకర్యాలతో ఒక విలాసవంతమైన ఇల్లును డార్లింగ్ అద్దెకు తీసుకున్నాడట. చికిత్స అయ్యేవరకు .. ఆ ఇంట్లోనే ఉండనున్నట్లు సమాచారం. ఇక ఆ ఇంటి అద్దె సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ కు అంత ఎమౌంట్ లెక్క కాకపోయినా.. ఆ రేట్ చూసిన అభిమానులకు మాత్రం దిమ్మతిరిగిపోతుంది. దీంతో ఒక చిన్నపాటి ఇల్లే తీసుకోవచ్చు.. అద్దె అంత ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ లండన్ లోనే కొన్నిరోజులు ఉండనున్నాడు. ఇండియా తిరిగి వచ్చాకా కల్కి షూటింగ్ లో తిరిగి పాల్గొంటాడని తెలుస్తోంది. ఇక ఇది కాకుండా రాజాసాబ్ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడట డార్లింగ్. మరి ఈ సినిమాలతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.