Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. సలార్ హిట్ తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుటుంది. ఈ మధ్యనే ప్రభాస్ పై ఒక కీలక షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. ఇక ఈ షెడ్యూల్ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది.