Oy Movie: ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. అప్పట్లో హిట్ అయిన సినిమాలు, ప్లాప్ అయినా సినిమాలు అని తేడా లేకుండా అకేషన్ కు తగ్గట్టు స్టార్ హీరోల సినిమాలను రీరిలీజ్ చేసి అభిమానులకు మంచి బూస్ట్ ఇస్తున్నారు. అప్పట్లో హిట్ అవ్వని సినిమాలు.. ఇప్పుడు కల్ట్ సినిమాలు అనే పేరుతో రీరిలీజ్ చేస్తున్నారు. ఇక నిన్న వాలెంటైన్స్ డే సందర్భంగా ఓయ్ సినిమాను రీరిలీజ్ చేశారు. 2009లో విడుదలైన ఓయ్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా.. కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేదు.సిద్ధార్థ్, షామిలీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఆనంద్ రంగా దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కన్నా.. రీరిలీజ్ లో సెన్సేషన్స్ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రతి పాయింట్ ను ఆనంద్ రంగా వివరించాడు.
ఉదయ్, సంధ్య పేర్లు లానే ఉదయం సాయంత్రం కలవవు అని, అందుకే ఆ పేర్లు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఓయ్ అంటే.. ప్రేమించినవారిని అలాగే పిలవడం విన్నాను అని, అందుకే ఆ టైటిల్ పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఉదయ్ లవ్ స్టోరీ వన్ ఇయర్ మాత్రమే ఉంటుందని, అదొక అద్భుతమని.. ఇలా మొత్తం తన భావాలను రాసుకొచ్చాడు. ఇక ఇక్కడవరకు ఓకే కానీ.. ఈ అందమైన లవ్ స్టోరీని కొంతమంది రివెంజ్ స్టోరీగా మార్చేశారు. అదేంటంటే.. సంధ్య ఉంటున్న ఇల్లు.. ఉదయ్ కంపెనీకి చెందిన స్థలం. ఆ ఇల్లు కోసం.. ఉదయ్ కంపెనీ.. సంధ్యకు నోటీసులు పంపిస్తే.. ఆమె కోర్ట్ లో కేసు వేస్తుంది. ఆ విషయం ఉదయ్ కు తెలిసి, సంధ్యను కలిసి, ప్రేమించి, ఆమె చనిపోయాకా.. ఆ ఇల్లును తన పేరు మీద రాయించుకున్నట్లు చూపించారు. తన కంపెనీపై కేసు వేసినందుకు సంధ్యపై ఉదయ్ రివెంజ్ తీర్చుకున్నాడని ఒకవీడియో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇది చూసాకా.. అసలు లవ్ స్టోరీ మర్చిపోయి.. రివెంజ్ స్టోరీగా మార్చేశారు కదరా.. అంటూ చెప్పుకొస్తున్నారు.
Oye a Sweet Revenge Story. Watch till end 🔥
#OyeReRelease #Oye @AnandRanga pic.twitter.com/nWjUjkrkQT
— Sirisin అను నేను (@SirisinSpeaks) February 14, 2024