Preminchoddu: ఓటీటీలోకి ‘ప్రేమించొద్దు – డోంట్ లవ్’ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’.. ‘డోంట్ లవ్ అనేది ట్యాగ్ లైన్. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. బస్తీ నేపథ్యంలో సాగే యూత్ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్తో రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ మూవీని రా అండ్ రస్టిక్గా తెరకెక్కించారు. స్కూల్, కాలేజ్ ఏజ్ లవ్ స్టోరీలు, ప్రేమ అంటూ చదువుల్ని నిర్లక్ష్యం చేయడం, తెలిసీ తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను హృద్యంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాను ‘బి సినీ ఈటీ’ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ మాధ్యమాలు అమెజాన్ ప్రైమ్, బి సినీ ఈటీ ఒటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ప్రేమించొద్దు- డోంట్ లవ్ మూవీని తెరకెక్కించాం. థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, బి సినీ ఈటీ ఒటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమించొద్దు సినిమా ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి అదే కథ లో మార్పులు చేర్పులు చేసుకొని బేబీ సినిమా తీశారు. నా సినిమా కథను దొంగిలించారని తెలుగు సినిమా ‘బేబీ’ నిర్మాతలపై నేను పోలీస్ స్టేషన్లో క్రిమినల్ ఫిర్యాదు చేసిన విషయం నా సర్కిల్లోని చాలా మందికి, అలాగే సినీ వర్గాల్లో వారికి తెలుసు. నేను ఇప్పుడు కోర్టులో కేసును కొనసాగిస్తున్నాను. ఇలాంటి నేపథ్యంలో ప్రేక్షకుల సహకారం నాకెంతో అవసరం. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
Also Read
- New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు 'షాక్'.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
- Ustaad Bhagat Singh OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదుగా
- Thaai Kizhavi : ఓటీటీలోకి రాధిక బ్లాక్‌బస్టర్.. ‘థాయ్ కిళవి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Mrithyunjay: ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ!
తాజావార్తలు
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!
-
Vijay-Governor: విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
-
China-Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు చైనా ప్రత్యక్ష సహాయం..!
-
Peddi: ‘పెద్ది’ రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!