కామెడీ మూవీస్ వరుసగా విడుదల అవుతున్నాయి.. అందులో కొన్ని సినిమాలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఇక థియేటర్లలో మాత్రమే కాదు ఓటీటీలోకి విడుదలయ్యే సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి.. ప్రియమణి భామకలాపం తర్వాత నిర్మాతలు బీ బాపినీడు, సుధీర్ ఈదర కలిసి వీరాంజనేయులు విహారయాత్ర పేరుతో కామెడీ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ సినిమాతో సుధీర్ పుల్లట్ల దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు..
వీరాంజనేయులు విహారయాత్ర సినిమాలో ప్రముఖ కమెడీయన్ బ్రహ్మనందంతో పాటుగా సీనియర్ యాక్టర్ నరేష్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.. కీడాకోలా ఫేమ్ రాగ్‌మయూర్, ప్రియావడ్లమాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.. ఈ సినిమాతో కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.. రోడ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకి విడుదల చేసేందుకు మేకర్స్ భావిస్తున్నారు..
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, పోస్టర్స్ జనాలను బాగా ఆకట్టుకుంది.. పాతకాలం నాటి వ్యాన్‌లో గోవాకు ఓ ఫ్యామిలీ మొత్తం గోవా టూర్ వెళుతున్నట్లుగా చూపించారు. వ్యాన్‌పైన లగేజీతో పాటు అస్తికలతో కూడిన చిన్న కుండ కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇక త్వరలోనే ఈటీవీ విన్ ఓటీటీలో ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.. ఎప్పుడు విడుదల కానుందో త్వరలోనే అధికార ప్రకటన రానుంది..