Prabhas: సలార్ ట్రైలర్… రెండు నిమిషాలు విధ్వంసమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. అందుకే.. ఈ మూడు సినిమాల ఆకలి తీర్చేందుకు.. ట్రిపుల్ రేట్ వడ్డీతో సహా ఇచ్చేందుకు వస్తోంది సలార్. సెప్టెంబర్ 28న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి వస్తున్నాడు ప్రభాస్. దానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. కానీ ఈలోపు ట్రైలర్ విధ్వంసం సృష్టించబోతోంది. సలార్ ట్రైలర్‌ను సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో 3 లేదా 7వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్‌లో సలార్ ట్రైలర్ అప్డేట్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. అలాగే హై ఓల్టేజ్ ట్రైలర్ కట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సలార్ టీజర్ ఒక నిమిషం 46 సెకన్లుగా కట్ చేసి.. డైనోసార్ అంటూ ఇచ్చిన ఎలివేషన్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది. దీంతో ఇప్పుడు సలార్ టైలర్ రన్ టైం ఎంత? అనేది ఎగ్జైటింగ్‌గా మారింది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. సలార్ ట్రైలర్ రన్ టైం రెండు నిమిషాల 20 సెకన్లుగా లాక్ చేసినట్టు తెలుస్తోంది. అంటే.. టీజర్ కంటే దాదాపు 35 సెకన్లు ఎక్కువ అన్నమాట. మొత్తంగా సలార్ ట్రైలర్ 140 సెకన్లకు అటు ఇటుగా నిడివితో రానుందని సమాచారం. ఇక ఈ ట్రైలర్‌లో ప్రభాస్‌కు ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదని అంటున్నారు. ఓన్లీ యాక్షన్ షాట్స్‌తోనే ట్రైలర్ నింపేశాడట ప్రశాంత్ నీల్. ఖచ్చితంగా సలార్ ట్రైలర్ అంచనాలకు మించి ఉంటుందని.. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ ఈ ట్రైలర్ తుడిచిపెట్టుకుపోవడం గ్యారెంటీ అంటున్నారు. మరి సలార్ ట్రైలర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
తాజావార్తలు
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!