Adipurush: రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ వెండితెరపై కనిపించిందే లేదు. ఆదిపురుష్ తో ఆ లోటు తీరిపోతుంది అనుకున్నారు కానీ ఈ సినిమా అంతకంతకు వెనక్కి వెళ్తూనే ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ ఎంతటి వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు.. గ్రాఫిక్స్ ఇంకా అవ్వకపోవడంతో జనవరి నుంచి జూన్ కు ఈ సినిమా వాయిదా పడింది.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ లో కూడా ఈ సినిమా వచ్చేలా కనిపించడం లేదు. గ్రాఫిక్స్ వారు మేకర్స్ ను ఇంకొద్దిగా సమయం కావాలని అడగడంతో ఈ చిత్రం జూన్ లో కూడా వచ్చేలా లేదని అంటున్నారు. ఆ లెక్కన ఈ సినిమా రావాలంటే సెప్టెంబర్ లో బయటికి రావాలి.. అదే నెలలో సలార్ రెడీ గా ఉంది. కనీసం ప్రభాస్ సినిమా సినిమాకు మూడు నెలలు గ్యాప్ ఇవ్వాలని ప్రభాస్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ జూన్ లో రాకుంటే దసరా టైమ్ కి కూడా వచ్చే అవకాశం లేదు. మరి వచ్చే ఏడాది ప్రభాస్ సినిమాలు అసలు వస్తాయా..? రావా ..? అనే డౌట్ తో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.