మాస్ మహరాజా రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘ఖిలాడి’. ఈ నెల 11న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఈ మూవీ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న పెన్ మూవీస్ సంస్థే దీన్ని హిందీలో గ్రాండ్ వే లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తోంది. దానికి సంబంధించిన పోస్టర్ నూ శనివారం విడుదల చేసింది. ఇదిలా ఉంటే… మూవీ విడుదల తేదీ దగ్గర పడిన సందర్భంగా ప్రమోషన్స్ జోరునూ దర్శక నిర్మాతలు రమేశ్ వర్మ, సత్యనారాయణ పెంచారు.
Read Also : బీచ్ వేర్ లో హీట్ పెంచేస్తున్న పూజాహెగ్డే
శుక్రవారం ఈ సినిమాలోని అనసూయ పోషిస్తున్న చంద్రకళ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. శనివారం ఇందులోని ఐదవ పాట ‘క్యాచ్ మీ’ లిరికల్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు. సాయంత్రం 5.04 నిమిషాలకు ఈ పాట జనం ముందుకు రాబోతోంది. ఈ లోగా ఓ పాటకు సంబంధించిన టీజర్ నూ రిలీజ్ చేస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.11న హిందీలోనూ రిలీజ్ కు రెడీ అవుతున్న ‘ఖిలాడి’