ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో “భీమ్లా నాయక్” ఫీవర్ నడుస్తోంది. మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా నేడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిక్కిరిసిన జనాలతో థియేటర్లలో మొదటి షోకే హౌస్ ఫుల్ బోర్డు పడింది. ఇప్పటికే ప్రీమియర్లు చూసిన ప్రేక్షకుల నుంచి సినిమాకు సానుకూల స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా హిందీ రిలీజ్ మాత్రం మరో వారం వాయిదా పడింది. “భీమ్లా నాయక్” నిర్మాతలు సినిమాను ఏకకాలంలో తెలుగు, హిందీ…
“భీమ్లా నాయక్” విడుదలపై ఇప్పుడు మెగా అభిమానుల్లో ఉత్కంఠతను నెలకొంది. ఈ సినిమాకు రెండు విడుదల తేదీలను ప్రకటించారు మేకర్స్. అయితే ఏపీ టిక్కెట్ల వివాదంతో పాటు, సీఎంతో సినీ ప్రముఖుల భేటీ తరువాత కొత్త జీవో వస్తే గనుక సినిమాను ఫిబ్రవరి 25నే విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అనుకున్నట్టుగానే నిన్న చిరు బృందం ఏపీ సీఎంతో చర్చించి, సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. అంతేకాదు మరో వారం, పది రోజుల్లో కొత్త జీవో…