Nuvve Nuvve: ఇప్పుడు త్రివిక్రమ్ మూవీ వంతు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nuvve Nuvve: మన స్టార్ హీరోల బర్త్ డేను పురస్కరించుకుని వాళ్ళు నటించిన సినిమాల స్పెషల్ షోస్ వేయడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలను అలానే ప్రదర్శించారు. అయితే ఆ మధ్య బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం విడుదలై ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేశ్ దాన్ని రీ-రిలీజ్ చేశారు. ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘నువ్వే నువ్వే’ విడుదలై ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీని స్పెషల్ షోను ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని ఎ.ఎం.బీ.లో ప్రదర్శించబోతున్నారు. ఈ స్పెషల్ షోకు మూవీ టీమ్ మొత్తం హాజరు కానుంది. మాటల రచయితగా చక్కని గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే’ మూవీని తెరకెక్కించి, ఆ తర్వాత ఇక వెను తిరిగి చూసుకోలేదు. ఇవాళ ఆయన తెలుగు చిత్రసీమలో టాప్ ఫైవ్ డైరెక్టర్స్ లో ఒకరంటే అతిశయోక్తి కాదు.
Read Also: SP Sailaja Birthday Special: అన్నకు తగ్గ చెల్లెలు ఎస్పీ శైలజ
Also Read
- Boycott Peddi: మెగా పవర్ స్టార్‌కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
- Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
- Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
- NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
నువ్వే నువ్వే సినిమాకు కోటి అందించిన పాటలు కూడా ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. ఈ మూవీలో తరుణ్ సరసన శ్రియ హీరోయిన్‌గా నటించింది. బొమ్మరిల్లు సినిమాలో కొడుకుపై అతి ప్రేమ చూపే పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్.. ఈ మూవీలో కుమార్తెపై ప్రేమను చూపించడంలో తన అభినయాన్ని పండిస్తాడు. ప్రకాష్ రాజ్, చంద్రమోహన్ క్యారెక్టర్లు కూడా ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి.
తాజావార్తలు
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్‌కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్‌షీట్’ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?