ప్రస్తుతం స్టార్ హీరోలందరూ అన్ని భాషల్లో తమ మార్కెట్ ని పెంచుకోవడానికి ఆరాటపడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు విడుదల అవుతున్న కారణంగా తమ మార్కెట్ ని దృషిలో పెట్టుకొని భాషతో సంబంధం లేకుండా అభిమానులకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, ప్రభాస్, రానా లాంటి వారు బాలీవుడ్ కి సుపరిచితమే.. ఇక వీరి కోవలోకే అల్లు అర్జున్, ఎన్టీఆర్ చేరబోతున్నారు. పుష్ప చిత్రం బన్నీ, ఆర్ఆర్ఆర్ చిత్రంతో తారక్ బాలీవుడ్ కి పరిచయం కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.
‘ఆర్ఆర్ఆర్’ చిత్ర ప్రమోషన్ లో భాగంగా రెండు నెలలు తారక్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడట.. ముఖ్యంగా బాలీవుడ్ లో గట్టిగా ప్రమోషన్ చేయడానికి రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ సైతం ఎక్కువ ఇంట్రెస్ట్ చుపిస్తున్నాడంట. అందులోనూ ఇటీవల తారక్ చేతికి గాయం కావడం. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించడంతో ఎన్టీఆర్ ఆ సమయాన్ని ఇలా సద్వినియోగం చేయాలనీ చూస్తున్నాడంట.. అందుకే కొరటాల సినిమాను కూడా కొద్దిగా వెనక్కి జరిపినట్లు సమాచారం. ఇక ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ బాలీవుడ్ రంగప్రవేశం పాన్ ఇండియా లెవెల్లో మాములుగా ఉండదు అని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.