JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు బాలీవుడ్ లో వార్-2 సినిమాలో నటిస్తూనే.. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న వార్-2తో ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లో నేరుగా సినిమా చేస్తున్నాడు తారక్. దాంతో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇందులో ఎన్టీఆర్ ఇంకా పాల్గొనలేదు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమాలో పాల్గొంటాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. నెల్సన్ తో సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది.
Read Also : Nidhi Agerwal : నెటిజన్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన నిధి అగర్వాల్..
కానీ రీసెంట్ గా మ్యాడ్ స్వ్కేర్ సక్సెస్ మీట్ కు వెళ్లిన ఎన్టీఆర్.. దేవర-2 కచ్చితంగా ఉంటుందని ప్రకటించాడు. అయితే ప్రశాంత్ నీల్ తో సినిమా అయిపోయిన తర్వాత కచ్చితంగా దేవర-2 సినిమా చేయబోతున్నాడంట ఎన్టీఆర్. ఇందుకోసం స్క్రిప్టు పూర్తి చేయాలంటూ ఇప్పటికే కొరటాలకు సూచించాడంట. కాకపోతే దానికి ఇంకా టైమ్ పడుతుంది. ప్రస్తుతం వార్-2 పనులు ఎండింగ్ కు వచ్చాయి. ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ తో చేసే మూవీకి 2026 కూడా పూర్తిగా పట్టే ఛాన్స్ ఉంది. అంటే 2027లోనే దేవర-2 మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇంకో ఏడాదిన్నర టైమ్ పట్టే అవకాశం ఉంది.