NTR: అయిపోయింది.. అంతా అయిపోయింది.. ఏదైతే జరగకూడదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకున్నారో అదే జరిగిపోయింది. మొదటి నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంటుందో ట్రోలర్స్ కూడా అంతే ఉన్నటు. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ దొరికితే చాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఏకిపారేస్తుంటారు. ఎన్టీఆర్ ను అభిమానించేవారు మాత్రం ఎప్పుడూ సపోర్ట్ గా నిలుస్తూ ట్రోలర్స్ కు చెక్ పెడుతూ వస్తున్నారు. ఇక మరోసారి ట్రోలర్స్ విరుచుకు పడే టైమ్ వచ్చింది అంటున్నారు నెటిజన్లు.. ఎందుకంటే తాజాగా ఎన్టీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియా లో ట్రెండ్ గా మారింది. కంత్రీ సినిమా కోసం పూర్తిగా తగ్గి కనిపించిన ఎన్టీఆర్ అప్పటినుంచి తన బాడీని పాత్రకు తగ్గట్టు మలుచుకుంటూ వస్తున్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ కోసం బొద్దుగా మారిన తారక్ మళ్లీ ఇప్పుడు కొరటాల శివ సినిమా కోసం న్యూ లుక్ లో దర్శనమిస్తాడు అనుకున్నారు అంతా.. ఇప్పటికే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అంటే.. స్క్రిప్ట్ రెడీ గా ఉంది ఎన్టీఆర్ లుక్ కోసం వెయిటింగ్.. అంటూ చెప్పుకొస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే ఈ సినిమా ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్ళేటట్లు ఏమి కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ లుక్ దాదాపు పదేళ్ల క్రితం ఉన్న ఎన్టీఆర్ ను గుర్తుచేస్తోంది. రాఖీలో ఎలా అయితే ఉన్నాడో అలా బొద్దుగా మారి కనిపించాడు. దీంతో ఒక్కసారిగా తారక్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇదేంటి ఎన్టీఆర్ ఏంటీ ఇలా మారిపోయాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొంపతీసి ఈ లుక్ లో అయితే సినిమా తీయడంలేదు కదా అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇక ఎన్టీఆర్ న్యూ లుక్ ట్రోలర్స్ కంట్లో పడడం ఆలస్యం ట్రోలింగ్ మొదలైయిపోయింది. అయితే ఈ లుక్ ఇప్పటిది కాదని, ఈ ఫోటో ఎపప్టిదో అంటూ మరికొంతమంది నొక్కివక్కాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా కోసం రెడీ అవుతున్నాడని, ఇది రీసెంట్ ఫోటో కాదని చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్ లుక్ పై స్పష్టత రావాలంటే ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. అన్న కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. మరి ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు వస్తాడా..? రాడా..? అనేది తెలియాల్సి ఉంది.