NTR 31 : ఎన్టీఆర్ – నీల్ సినిమా రిలీజ్ డేట్ మారింది.. టీజర్ డేట్ వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : NANI : మే1న నానిపై ముప్పేట దాడి.. తట్టుకోగలడా
Also Read
కాగా ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని పూజా కార్యక్రమాలు నిర్వహించిన రోజు ప్రకటించారు మేకర్స్. కానీ అనుకోని కారణాల కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండడం, మధ్యలో వార్ 2కు ఆగష్టులో ప్రమోషన్స్ కోసం డేట్స్ ఇవ్వాల్సి ఉండడం వంటి కారణంగా ఈ సినిమా సంక్రాంతికి రాదు అనే వాదనలు వినిపించాయి. ఆ వాదనలకు తెరదించుతూ న్యూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. 2026 జూన్ 25న ఎన్టీఆర్ నీల్ సినిమాను రిలీజ్ చేస్తామని కొద్దీ సేపటి క్రితం అనౌన్స్ చేసారు. అలాగే యంగ్ టైగర్ పుట్టిన రోజు కానుకగా మే 20న న ఎన్టీఆర్, నీల్ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వారం క్రితం యంగ్ టైగర్ ఈ సినిమా సెట్స్ లో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!