యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే నందమూరి అభిమానులకి చాలా ఇష్టం. సినిమాల రిజల్ట్ కి అతీతంగా ఎన్టీఆర్ ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అభిమానులు. హిట్స్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారో, రామయ్య వస్తావయ్యా-రభస లాంటి సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పుడు ఎన్టీఆర్ కి అంతే అండగా నిలిచారు. టాపిక్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ పేరుని సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యడంలో దిట్ట అయిన ఫాన్స్, ఈసారి మాత్రం ఒక కొత్త విషయాన్ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ‘ఎన్టీఆర్ 30’ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది, సెట్స్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతున్న సమయంలో ఒక వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో ఎన్టీఆర్ బ్యాక్ సైడ్ లుక్ మాత్రమే రివీల్ చేశారు. ఎన్టీఆర్ పక్కనే కొరటాల శివ కూడా ఉన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ వీడియోలో నుంచి ఎన్టీఆర్ రెండు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాడు, బృందావనం తర్వాత ఎన్టీఆర్ రెండు కమ్మలు పెట్టుకోవడం ఇదే మొదటిసారి అంటూ ఫ్యాన్ థియరీ బయటకి వచ్చేసింది.
సరిగ్గా లైటింగ్ లేకుండా హీరోని ప్రాపర్ గా రివీల్ చెయ్యకుండా రివీల్ చేసిన వీడియోలో ఫాన్స్ ఈ అబ్సర్వేషన్ చెయ్యడం గొప్ప విషయమే. ఎన్టీఆర్ గతంలో బాద్షా, ఊసరవెల్లి సినిమాల్లో కూడా ఇయర్ రింగ్ పెట్టుకున్నాడు కానీ అది ఒక చెవికి మాత్రమే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన బృందావనం సినిమా తర్వాత ఎన్టీఆర్ రెండు ఇయర్ రింగ్స్ తో కనిపించడం ఇదే మొదటిసారి. ఈ రెండు సినిమాలకి ఉన్న కామన్ పాయింట్ కొరటాల శివ. బృందావనం సినిమాకి కొరటాల శివ రైటర్ గా వ్యవహరించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కాంబినేషన్ మరో హిట్ ని పాన్ ఇండియా రేంజులో ఇస్తుందేమో చూడాలి అంటే 2024 సమ్మర్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.