RRR Dubai Press Meet లో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జక్కన్న మ్యాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక సినిమా విడుదలకు ఎక్కువ రోజులు లేకపోవడంతో “ఆర్ఆర్ఆర్ ” టీం ప్రమోషన్లలో దూకుడును పెంచింది. తాజాగా ఐకానిక్ సిటీ దుబాయ్ లో ల్యాండైన “ఆర్ఆర్ఆర్” టీం అక్కడ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి పాల్గొన్నారు. ఇందులో భాగంగా చెర్రీ, తారక్, రాజమౌళిలను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగానే రాజమౌళితో చనువుగా ఉండడం ప్లస్ అయ్యిందా ? మైనస్ అయ్యిందా ? అనే ప్రశ్న తారక్ కు ఎదురైంది.
Read Also : RRR : ఐకానిన్ సిటీలో ల్యాండైన టీం… అసలు ప్లాన్ రివీల్
ఈ ప్రశ్నకు తారక్ చెప్పిన సమాధానం అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. “రాజమౌళి తో చనువుగా ఉండటం వల్ల నాకు మైనస్ అయ్యింది” అని ఎన్టీఆర్ అన్నారు. ఆయన కొనసాగిస్తూ “అంటే కనికరం లేకుండా 65 నైట్స్ షూటింగ్ లో… మేము షూటింగ్ స్టార్ట్ చేసింది సమ్మర్ లో… కానీ కరోనా, లాక్ డౌన్ వచ్చింది. రాజమౌళి ఆ ఎపిసోడ్ ను స్టార్ట్ చేసినప్పుడు శీతాకాలం. ఫుల్లీ చలిలో ఉదయాన్నే వణికిపోయాను. రాజమౌళి ఫైర్ కదా… ఆయన హ్యాపీ” అంటూ అందరినీ నవ్వించారు. “ఈ ఒక్క పాయింట్ తప్ప ఇక ఆయనతో ఉన్న పరిచయం నాకు ఎప్పటికి ప్లస్… నేను ఇంతటి యాక్టర్ గా ఎదిగానంటే ఆయన వల్లే…” అంటూ రాజమౌళికి బిగ్ క్రెడిట్ ఇచ్చేశారు ఎన్టీఆర్.