పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసేశారు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ఇస్తున్న అప్డేట్స్ ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. ఒక పవర్ స్టార్ అభిమానిగా, ఓజిని నెక్స్ట్ లెవల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు సుజీత్. ప్రస్తుతం పవన్ పొలిటికల్ కారణంగా బిజీగా ఉన్న పవర్ స్టార్… సెప్టెంబర్‌లో ఓజీ కోసం కాల్ షీట్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటివరకు ఆగడం ఎందుకని సుజీత్, పవన్ లేని బ్యాలెన్స్ షూటింగ్‌ను జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేస్తున్నాడు. మరోసారి పవన్ ఈ సినిమాకు డేట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే… డిసెంబర్‌లో ఓజి మూవీని రిలీజ్ చేస్తారనే కొన్ని రోజుల క్రితం వినిపించింది కానీ ఇప్పుడు మరో కొత్త డేట్‌ను ఆప్షన్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ డిసెంబర్‌లో ఓజి రిలీజ్ సాధ్యం కాకుంటే… వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో ఎట్టి పరిస్థితిలోను ఆడియెన్స్ ముందుకి తీసుకు రావాలనే ఆలోచనలో ఉన్నారట.
సరిగ్గా ఎలక్షన్స్ ముందు OGని ఆడియన్స్ ముందుకి తెస్తే పవన్ ఫ్యాన్స్ అంతా జోష్ లో ఉంటారు, అది ఎన్నికలకి కూడా హెల్ప్ అవుతుందనేది ఆలోచన కావచ్చు. అయితే.. అదే నెలలో ఎన్టీఆర్ ‘దేవర’ రిలీజ్ కానుంది. కొరటాల శివ భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో… దేవరపై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. అందుకే ఒకవేళ నిజంగానే ఓజీ మూవీ ఏప్రిల్‌లో రిలీజ్ అయితే.. బాక్సాఫీస్ దగ్గర బిగ్ క్లాష్ తప్పదు. ఖచ్చితంగా థియేటర్లు తగలబడిపోతాయ్. టాలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా స్థాయిలో ఈ రేంజ్ బాక్సాఫీస్ వార్ ని ఇప్పటివరకూ మన ఆడియన్స్ చూసి ఉండరు. దేవర vs OG ఫైట్ పడితే మాత్రం ర్యాంపేజ్ ని చూడడం గ్యారెంటీ. అయితే పవన్ వర్సెస్ ఎన్టీఆర్ వార్‌ను ఇప్పుడే డిసైడ్ చేయలేం. డిసెంబర్ దగ్గర పడే కొద్దీ ఆ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.