NTV Telugu Site icon

Varasudu: మెగా-నందమూరి దెబ్బకి ఈ సినిమా సైలెంట్ అయినట్లేనా?

Varasudu

Varasudu

2023 సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాల కన్నా తన డబ్బింగ్ సినిమాకే ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నాడు అంటూ స్టార్ ప్రొడ్యూసర్ పై ఎప్పటినుంచి విమర్శలు మొదలయ్యాయో అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ గురించి డిస్కషన్ మొదలయ్యింది. సినిమా ఎవరిదైనా, డబ్బులు మాత్రం అందరివీ… ఎవరు ఏ సినిమా తీసినా డబ్బులు పెట్టే తీస్తారు, డబ్బుల కోసమే తీస్తారు. బ్రతకడమే కష్టం అయినప్పుడు, ఎలా బ్రతికితే ఏంటి అనే సినిమా డైలాగ్ చెప్పినట్లు. అసలు సినిమా థియేటర్స్ లో బ్రతకడమే కష్టం అవుతున్న సమయంలో, కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమాని చెయ్యడమే రిస్క్. అలాంటప్పుడు దాన్ని బ్రతికించుకోవడం కోట్లు ఖర్చు పెట్టిన దిల్ రాజు హక్కు. సో సినిమాని ఆపమని, విడుదల ఇన్ని సెంటర్స్ లోనే చెయ్యాలి అని చెప్పే రైట్ ఎవరికీ లేదు. పైగా వారసుడు సినిమా దిల్ రాజు, ఎవరి దెగ్గర నుంచో డబ్బింగ్ రైట్స్  కొనుకున్న మూవీ కాదు. అది ఆయన ప్రొడ్యూస్ చేసిన ద్వీభాషా చిత్రం, సో ఆయన ఓన్ ప్రోడక్ట్ ని ఎక్కువ మంది రీచ్ అయ్యేలా చెయ్యడానికి దిల్ రాజు ఎన్ని తంటాలు పడినా తప్పులేదు. అందుకే వారసుడు సినిమా రిలీజ్ విషయంలో చాలా మంది దిల్ రాజుని సపోర్ట్ చేశారు.

దిల్ రాజు కూడా మేజర్ థియేటర్స్, మంచి ఫెసిలిటీస్ ఉన్న థియేటర్స్ ని వారసుడు సినిమాకి బుక్ చేసుకున్నాడు. దీంతో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలకి థియేటర్స్ తగ్గాయి, మన సినిమాల ఓపెనింగ్స్ దెబ్బ తింటాయి అనే ఆందోళన అందరిలోనూ కలిగింది. ఇందుకు తగ్గట్లే వారసుడు సినిమా నుంచి మొదట్లో వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదిరిపోయింది. రంజితమే సాంగ్, థీ దళపతి సాంగ్ ‘వారసుడు’ ప్రమోషన్స్ ని ఆకాశం అంత ఎత్తుకి తీసుకోని పోయాయి. ఈ రెండు పాటలు బయటకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా వారసుడు సినిమాపై అంచనాలు పెరిగాయి కానీ ఇక్కడి నుంచే వారసుడు సినిమా డౌన్ అవ్వడం కూడా మొదలయ్యినట్లు ఉంది. అ తర్వాత వారసుడు సినిమా నుంచి వచ్చిన పాటలు మాస్ ని ఎంటర్టైన్ చెయ్యలేకపోయాయి, క్లాస్ ని మెప్పించినా పాజిటివ్ బజ్ ని క్రియేట్ చెయ్యలేకపోయాయి. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే విజయ్ సినిమా డౌన్ ఫాన్ మొదలయ్యింది ‘ట్రైలర్’ నుంచే, ఈ ట్రైలర్ ని చూడగానే ఆడియన్స్ కి చాలా తెలుగు సినిమాలు గుర్తొచ్చాయి. ఒక రెగ్యులర్ ఓల్డ్ ఫార్మాట్ ఫ్యామిలీ సినిమా చూడబోతున్నాం అని ప్రేక్షకులకి అర్ధం అయ్యింది. దీంతో నెమ్మదిగా ఆడియన్స్ కి వారసుడు సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వస్తోంది.

ఇదే సమయంలో బాలకృష్ణ, చిరంజీవిలు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలని మైత్రీ మూవీ మేకర్స్ అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తుండడం. ఈ రెండు సినిమాల ట్రైలర్, సినీ అభిమానులకి వింటేజ్ వైబ్స్ ఇవ్వడంలో సక్సస్ అయ్యాయి. ముఖ్యంగా చిరు, బాలయ్యలు తమకి టైలర్ మేడ్ లాంటి పాత్రల్లో కనిపించి డై హార్డ్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాల నుంచి బయటకి వచ్చిన సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ అవుతున్నాయి. మన సినిమాలు బాగోలేకనో, యావరేజ్ గా ఉంటేనో ఆడియన్స్ ఇంకో సినిమా వైపు చూస్తారు. అలాంటిది మన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారెంటీ అని ప్రతి ప్రమోషనల్ కంటెంట్ చెప్తుంటే డబ్బింగ్ సినిమావైపు ఆడియన్స్ వెళ్లడం అనేది కష్టమైన పనే. పైగా పండగ సీజన్ కాబట్టి కుటుంబం అంతా కలిసి చిరునో, బాలకృష్ణనో చూడాలి అనుకున్నంతగా విజయ్ ని చూడాలి అనుకోరు. ఇలాంటి అంశాల కారణంగానే వారసుడు సినిమాకి తెలుగులో బజ్ రోజురోజుకీ తగ్గుతూ వస్తోంది. ఇది ఇలానే కంటిన్యు అయితే జనవరి 11 నాటికి దిల్ రాజు ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ ని రాబట్టడంలో వారసుడు సినిమా ఫెయిల్ అవుతుంది. అదే జరిగితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వడం కష్టమవుతుంది.

Show comments