NITHIIN32: మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ కు నిరాశే మిగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈసారి ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని నితిన్ కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్నాడంటూ కొన్నిరోజుల నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ అధికారికంగా ఈ కాంబో ప్రకటించేశారు మేకర్స్. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రా అండ్ రస్టిక్ లుక్ లో నితిన్ కనిపించబోతున్నాడట. పుష్ప సినిమాలో లానే ఈ సినిమాలో నితిన్ స్మగ్లర్ గా కనిపిస్తున్నాడని టాక్. ఇప్పటికే మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వంశీమొదటి సినిమాతోనే బోల్డెన్ని విమర్శలు అందుకున్నాడు. ఇక ఇన్నేళ్లు గ్యాప్ తీసుకొని యంగ్ హీరోను నమ్ముకొని ఈ సినిమా తీస్తున్నాడు. మరి ఈసారైనా వీరిద్దరూ హిట్ అందుకుంటారా..? లేదా అనేది తెలియాలి.