Nikhil Siddhartha clarity on release date tension: కార్తికేయ 2, 18 పేజీస్ వంటి సినిమాలతో హిట్లు అందుకున్న నిఖిల్ సిద్ధార్థ పాన్ ఇండియా రేంజ్ లో చేసిన తాజా చిత్రం స్పై. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణ మిస్టరీకి సంబంధించిన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది. నిజానికి ముందుగా ఈ సినిమాని జూన్ 29వ తేదీన రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు, ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే ఏమైందో ఏమో నిఖిల్ మాత్రం ఆ డేట్ కి సినిమా రిలీజ్ చేయవద్దని నిర్మాత మీద ప్రెజర్ తీసుకువచ్చాడు. అయితే నిర్మాత మాత్రం ఓటీటీలు సహా అందరితో ఒప్పందాలు కుదిరిపోయాయి కాబట్టి ఇప్పుడు వాయిదా వేయలేనని చేతులెత్తేశాడు. ఎట్టకేలకు నిర్మాత సినిమాని జూన్ 29వ తేదీనే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి నిఖిల్ చేత కూడా ప్రకటింపజేశారు.
Tollywood Releases: ఈ శుక్రవారం 10 చిన్న సినిమాలు.. ఏమేమంటే?
అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వగా అది అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ వివాదం మీద స్పందించిన నిఖిల్ సిద్ధార్థ నా బాధంతా ఒకటే ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు మినిమమ్ 200, 250 రూపాయల దాకా వెళ్ళిపోయాయి అవుట్ ఫుట్ కూడా ఆ ధరను మ్యాచ్ చేసేలాగా ఉండాలి అని చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం తాను ఈ సినిమా చూసినప్పుడు ఇంకా చాలా వర్క్ బ్యాలెన్స్ ఉందని అందుకే 29వ తేదీ రిలీజ్ వద్దు అని కోరానని అన్నారు. అయితే 200 మంది చేయాల్సిన విఎఫ్ఎక్స్ మీద 2000 మంది పనిచేశారు, దాదాపుగా ఈ ఒక్క సినిమా కోసమే ఐదారు విఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేశాయని అందుకే ఈరోజు విజయవంతంగా సెన్సార్ కూడా పూర్తి చేయగలిగామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అసలు వివాదమే లేదని కేవలం అవుట్ ఫుట్ విషయంలోనే కాస్త భేదాభిప్రాయాలు నిర్మాత, హీరో మధ్య వచ్చాయనే విషయం తేటతెల్లమైంది. ఈ సినిమాని గ్యారీ బీహెచ్ డైరెక్ట్ చేస్తుండగా రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి స్వయంగా రాజశేఖర్ రెడ్డి కదా అందించడం గమనార్హం.