మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు విజయం దక్కలేదు. ఇక ఈ సినిమా తరువాత ఒకటి, రెండు సినిమాలు చేసినా అదృష్టం కలిసి రాకపోయేసరికి హీరోయిన్ గా తప్పుకొని పెళ్ళికి ఓకే చెప్పింది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. ఇక ఇటీవలే నిహారిక పబ్ ఇన్సిడెంట్‌తో వైరల్ గా మరీనా విషయం విదితమే.. ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో నిహారిక దొరకడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా లో ఆమెపై ట్రోలర్స్ విరుచుకు పడ్డారు. అయితే నిహారిక డ్రగ్స్ తీసుకోలేదని నాగబాబు క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే.
ఇక ఈ పోలీస్ కేసు తర్వాత నిహా బయట కానీ, సోషల్ మీడియాలో కనై కనిపించింది లేదు. ఇక తాజాగా నిహారిక లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి., జిమ్ లో కసరత్తులు చేస్తూ.. స్నేహితుడితో ఫోజులు ఇచ్చింది మెగా డాటర్. అయితే ఈ ఫోటోలలో నిహారిక లో మార్పు కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. షార్ట్ హెయిర్, చిక్కిపోయిన ముఖం.. బక్కచిక్కిన దేహం తో అస్సలు గుర్తుపట్టలేకుండా కనిపించింది. దీంతో అభిమానులు ఈమె మెగా డాటర్ నిహారికానేనా అని ఆరా తీస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం నిహారిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ తో మెప్పించిన నిహా త్వరలోనే మరో వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.