‘హరిహర వీరమల్లు’ స్టోరీ లీక్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇకపోతే ఇటీవల నిధి అగర్వాల్ నటించిన ‘హీరో’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ లో పాల్గొన్న నిధి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. ఈ సినిమా తరువాత నిధి పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ జరుపుకోంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పవన్, నిధి పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ఇక తాజాగా నిధి పవన్ గురించి, సినిమా గురించి మాట్లాడుతూ ఒక కీలక విషయాన్ని రివీల్ చేసింది.
పవన్ తో నటించడం తన అదృష్టమని, వీలుంటే రెండోసారి కూడా ఆయనతో నటించడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. ఇక ‘హరిహర వీరమల్లు’ రెండు టైం జోన్లలో నడిచే కథ అని, ఒకటి పురాతన కాలంలో మరొకటి ఈ కాలంలో నడుస్తుందని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా పూర్తిగా చారిత్రాత్మకంగా ఉండబోతుందని, పవన్ సినిమా మొత్తం వీరమల్లు లానే కనిపిస్తాడని అనుకున్నారు. కానీ, ఇప్పుడు నిధి చెప్పిన ప్రకారం పవన్ రెండు గెటప్పులో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు క్రిష్, చిత్ర యూనిట్ రివీల్ చేయని సీక్రెట్ ని నిధి లీక్ చేయడంపై అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి క్రిష్ ఈ సినిమాను ఏ రేంజ్ లో తీర్చిదిద్దుతున్నాడో చూడాలి.
Also Read
- Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
- RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
- Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
-
Municipal Elections: కర్నూల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 3 గంటల సమయానికి 48.03 శాతం ఓటింగ్ నమోదు..
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
YS Jagan: ఓటు వేయకుండానే వెనుదిరిగిన మాజీ సీఎం జగన్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
-
RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!