ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 టాప్ ప్లేస్‌లో ఉంటుంది. 2021లో డివైడ్ టాక్‌తో మొదలైన పుష్పరాజ్ వేట… 350 కోట్ల దగ్గర ఆగింది. అందుకే ఇప్పుడు పుష్ప2ని పుష్ప పార్ట్ వన్ లైఫ్ టైం కలెక్షన్ల కంటే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పటికే సుకుమార్‌కు అన్ లిమిటేడ్ ఆఫర్ ఇచ్చినట్టు టాక్. అందుకు తగ్గట్టే ఊహించని మార్పులతో పుష్ప పార్ట్ 2 తెరకెక్కిస్తున్నాడు సుక్కు. అవుట్ పుట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవడం లేదు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టు… పుష్ప సినిమాతో బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు అల్లు అర్జున్. ఇది చాలదా… నెక్స్ట్ పుష్పగాడి రూల్ ఎలా ఉంటుందో చూపించడానికి. ఈ ఒక్క అవార్డ్ పుష్పరాజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. పుష్ప 2 పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఇప్పటికే పుష్ప2ని నెక్స్ట్ లెవల్ అనేలా తెరకెక్కిస్తున్న సుకుమార్… నేషనల్ అవార్డ్ ఇచ్చిన బూస్టింగ్‌తో ఇంకెలా డిజైన్ చేస్తాడో ఊహించుకోవచ్చు. గతంలో రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప వీడియో, బన్నీ అమ్మవారి గెటప్ హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. అయితే ఈ సినిమా థియేటర్లోకి ఎప్పుడొస్తుంది? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. తాజాగా పుష్పరాజ్ సాలిడ్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం 2024 మార్చి 22న పుష్ప2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. లాంగ్ వీకెండ్, హాలీడేస్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ డేట్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ మార్చి 23, 24 వీకెండ్ అవగా… మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్‌ఫ్రైడ్ రానున్నాయి. ఈ హాలీడేస్ చాలు పుష్ప 2ని వెయ్యి కోట్ల క్లబ్‌లో పడేయడానికి… అందుకే మార్చి 22న పుష్ప2 రిలీజ్ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.