Sivam Media: టాలీవుడ్‌లో నూతన నిర్మాణ సంస్థ శివమ్ మీడియా ప్రారంభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Production House Named Sivam Media Launched in tollywood: టాలీవుడ్‌లో నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్ మీడియా’ పేరుతో ప్రారంభం అయ్యింది. సీనియర్ జర్నలిస్ట్ శివమల్లాల ఈ బ్యానర్‌కి నిర్మాతగా వ్యవహరించనున్నారు. గురువారం ఈ సినిమా శివమ్ మీడియా లోగో అలాగే బ్యానర్‌ను ప్రముఖ నటులు అలీ నిర్మాత, దర్శకులు ప్రవీణా కడియాల , అనిల్ కడియాల చేతుల మీదుగా బ్యానర్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ శివ నా తమ్ముడు లాంటివాడు, గత 20 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుండి కెరీర్‌ను ప్రారంభించి ఈ రోజున నిర్మాతగా తన బ్యానర్‌ను స్థాపించి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉందన్నారు. అనిల్ కడియాల మాట్లాడుతూ– శివమల్లాల తొలి రోజుల్నుంచి మాకు మంచి ఫ్రెండ్, అందుకే మా జర్నీలో శివ ఎప్పుడు ఉన్నాడు. ఈ రోజు ‘శివమ్ మీడియా’ అనే బ్యానర్ ద్వారా శివ అనేక సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ చిన్న రిపోర్టర్‌గా పిఆర్వోగా పనిచేసిన మా శివాయేనా ఒక బ్యానర్‌ని పెట్టింది అనిపిస్తుంది. ‘శివమ్ మీడియా’ విషయంలో నేను ఎంతో ప్రౌడ్‌గా ఫీలవుతున్నా, ఈ బ్యానర్‌ద్వారా డబ్బింగ్ సినిమానా, స్ట్రెయిట్ సినిమానా అనే తేడా లేకుండా అనేక మంచి సినిమాలు వస్తాయని రావాలని కోరుకుంటున్నానన్నారు. శివమ్ మీడియా నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ–‘‘ నాకు ఎప్పుడు సపోర్టు చేసే ముగ్గురు స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణా, ఈ ముగ్గురు చేతుల మీదుగా నా బ్యానర్‌ని ప్రారంభించటం ఎంతో హ్యాపీ అన్నారు. శివమ్ మీడియా బ్యానర్‌పై మంచి సినిమాలు చేస్తాననన్నారు. ఈ సినిమాలో హీరోగా హమరేశ్, హీరోయిన్ గా ప్రార్థన సందీప్ నటిస్తున్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
-
Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్‌హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
-
Govinda: 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. మనసులోని బాధ బయటపెట్టిన గోవింద
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
ట్రెండింగ్
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!