Raviteja Gopichand Malineni: ఆ సూపర్ హిట్ సెంటిమెంట్ వీళ్లకీ హిట్ ఇస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంటే డైలాగులు కూడా సరిపోని సమయంలో మన దర్శకులంతా, హీరోని జంతువులతో పోల్చి ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ పులికి ఇవ్వాల్సిందే. ఎంతమంది హీరోలని, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని సినిమాల్లో పులి హీరోని ఎలివేట్ చేసిందో లెక్కేయ్యడం కూడా కష్టమే. హీరో ఎలివేషన్ సీన్ పడాలి అంటే పులి ఉండాల్సిందే లేదా పులి డైలాగ్ అయినా ఉండాల్సిందే అనిపించే రేంజులో మన దర్శకులు సినిమాలు చేశారు. రాజమౌళి అయితే పులితో రామ్ చరణ్ తో ఏకంగా మొహం పగలకొట్టించాడు కూడా. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఈ సీన్ ని సినీ అభిమానులంతా విజిల్స్ వేశారు. ఆ తర్వాత పులి స్థాయిలో వాడిన మరో జంతువు సింహం. ఈ అడివి రాజుని ఎలివేషన్ కోసం మాత్రమే కాదు సినిమా టైటిల్స్ కోసం కూడా వాడేసారు. బాలయ్య లాంటి హీరో సినిమా టైటిల్ లో ‘సింహా’ అనే పదం ఉంటే చాలు నందమూరి అభిమానులకి పూనకలు వస్తాయి. పులి, సింహం లాంటి క్రూర జంతువులు అయిపోయాక మన ఫిల్మ్ మేకర్స్ కి ‘ఈగల్’ దొరికింది. ‘ది ఈగల్ ఈజ్ కమింగ్’ అంటూ హీరో క్యారెక్టర్ కి కాస్త తెలివితేటలు ఉంటే చాలు ఈగల్ ని వాడేసారు. మధ్యలో పీరియాడిక్ డ్రామా జానర్ లో తెరకేక్కే సినిమాల కోసం గురాన్ని కూడా గట్టిగానే వాడారండోయ్.
మెగా హీరోలని ఎలివేట్ చెయ్యడానికి గుర్రపుస్వారీలు ఉపయోగ పడినంత మరో జంతువు ఉపయోగ పడలేదు. మెగాస్టార్ నుంచి పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ వరకూ ప్రతి ఒక్కరూ గుర్రం ఎక్కిన వారే. ఇలా సినిమాల్లో ఎదో ఒక చోట జంతువులని వాడి హిట్ కొట్టడం మన ఫిల్మ్ మేకర్స్ కి బాగా అలవాటైన పని. పులి, సింహం, గుర్రం, ఈగల్ లాంటివి అయిపోయిన తర్వాత ఫిల్మ్ మేకర్స్ దృష్టి ఇప్పుడు ‘కాకి’పైన పడినట్లు ఉంది. బలగం సినిమా మొత్తం కాకి చుట్టే తిరిగింది, దసరా సినిమాలో కూడా కాకి ప్రెజెన్స్ ఉంది. ఇక లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరుపాక్ష’ సినిమాలో కూడా ‘కాకి’ చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎవరైనా చనిపోతే, వారికి పిండం పెట్టడం మన ఆచారం. ఈ సమయంలో కాకి వచ్చి ఆ పిండం తింటే చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరినట్లు అని మనం భావిస్తూ ఉంటాం. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కాకి ఈ పాత్రమే ప్లే చేస్తుంది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఆ కాకి సెంటిమెంట్ ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ-గోపీచంద్ మలినేని కూడా ఇస్తుందేమో చూడాలి. ఎందుకంటే నాలుగో సారి కలిసి సినిమా చేస్తున్న ఈ మాస్ కాంబినేషన్ #RT4GT అనే ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ‘కాకి’ కూడా ఉంది. పోస్టర్ లో డేంజర్ బోర్డ్ దగ్గర కాకి కనపడుతుండడంతో… అసలే రవితేజ-గోపీచంద్ మలినేనిలది సూపర్ హిట్ కాంబినేషన్, కాకి సెంటిమెంట్ కూడా తోడైతే ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారెంటీ.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!