Nandamuri Family: కొత్త హీరో… కొత్త కథ… కొత్త టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి ఫ్యామిలీ నుంచి స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసులుగా ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు స్టార్ హీరో స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య మూడున్నర దశాబ్దాలుగా TFIకి మెయిన్ పిల్లర్స్ లో ఒకడిగా ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతకి తగ్గ మనవడిగా టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నందమూరి వంశానికి సరైన వారసుడిగా, నందమూరి అనే ఇంటి పేరుతో పాటు తాత తారకరామారావు పేరుని కూడా పాన్ వరల్డ్ వరకూ తీసుకోని వెళ్లాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని కూడా ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడిప్పుడే ఫ్లాప్స్ నుంచి బయటకి వచ్చి మినిమం గ్యారెంటీ సినిమాలని చేస్తున్నాడు. బింబిసార సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన కళ్యాణ్ రామ్ నెక్స్ట్ ‘డెవిల్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
ఇలా ముగ్గురు హీరోలు స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో లాంచ్ అవుతున్నాడు. నందమూరి జయకృష్ణ కొడుకు అయిన నందమూరి చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బసవ తారకరామా క్రియేషన్స్ పేరుతో సొంత బ్యానర్ ని స్థాపించి చైతన్య కృష్ణ హీరోగా డెబ్యు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. గతేడాది మే నెలలో చైతన్య కృష్ణ హీరోగా వంశీ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటుంది. బాలయ్య లాంచ్ చేసిన ఈ మూవీకి బ్రీత్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ని మేకర్స్ లాంచ్ చేసారు. ఇంటెన్స్ మెడికల్ మాఫియా డ్రామాగా బ్రీత్ సినిమా రూపొందుతున్నట్లు ఉంది. మేకింగ్ చాలా బాగుంది, మార్క్ రాబిన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెస్ చేసింది. కథ ఏంటి అనే విషయంలో ఎలాంటి హింట్ ఇవ్వకుండా బ్రీత్ టీజర్ ని కట్ చేసిన విధానం బాగుంది. మరి నందమూరి కుటుంబం నుంచి వస్తున్న ఈ కొత్త హీరో ఎంతవరకూ ప్రేక్షకులని మెప్పిస్తాడు అనేది చూడాలి.
Also Read
- Sushmita Konidela: విజయవాడ దుర్గమ్మ ఆలయ ప్రత్యేక ఆహ్వానితురాలిగా మెగాడాటర్
- Epic: ‘కడలి’ ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది.. ఫ్యామిలీ ఆడియన్స్ ని 'ఎపిక్' మెప్పిస్తుంది : వైష్ణవి చైతన్య
- Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. 'అమ్ములు' ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
- Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
తాజావార్తలు
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
-
Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!