Adi Saikumar: ‘లవ్‌లీ’ హీరో ఆది సాయి కుమార్ కు సక్సెస్ రేట్ ఎలా ఉన్నా… నిమిషం తీరికలేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. విశేషం ఏమంటే… అతని సినిమాలు యేడాదికి నాలుగైదు తేలికగా విడుదల అవుతున్నాయి. అలా ఈ యేడాది ఇప్పటికే ‘సి.ఎస్.ఐ. సనాతన్’ మూవీ విడుదలైంది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో తన సత్తా చాటుతోంది. భవానీ మీడియా సంస్థ ద్వారా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆది సాయి కుమార్ యాక్షన్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్రేక్షకులను సైతం ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మధ్య ఆయన సినిమాలు ఓటీటీలో ఎక్కువగా ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆదికి జోడీగా మిషా నారంగ్ హీరోయిన్‌గా నటించగా.. నందిని రాయ్, ఖయ్యుం, రవి ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.
ఈ చిత్రంలో ఆది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్‌గా చక్కని నటనను కనబరిచారు. అనీష్ సోలోమన్ సంగీతం, గంగనమోని శేఖర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్ శ్రీనివాస్ నిర్మించగా శివశంకర్ దేవ్ దర్శకత్వం వహించారు.