Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క బిజినెస్ మ్యాన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సినిమా థియేటర్ ను ఓపెన్ చేసిన మహేష్ తాజాగా ఫుడ్ బిజినెస్ లోకి దిగిన విషయం విదితమే. మినర్వా కాఫి షాప్, ప్యాలెస్ హైట్స్ రెస్టారెంట్ తో టైఅప్ అయిన నమ్రత, ఏషియన్ గ్రూప్స్ AN రెస్టారెంట్ పేరుతో నేడు గ్రాండ్ గా ఓపెన్ చేశారు. ఇక మహేష్ రెస్టారెంట్ కదా అభిమానులందరూ ఆ రెస్టారెంట్ కు వెళదామని రెడీ అయ్యి ఆ మెనూ చూసి అవాక్కయ్యారు. ఎందుకు.. ఐటమ్స్ అన్ని లేవా అనుకుంటున్నారా..ఐటమ్స్ ఉన్నాయి.. కానీ వాటి రేటే చుక్కలు చూపిస్తున్నాయి.
మధ్యతరగతి కుటుంబాలు ఏ మాత్రం ఆ రెస్టారెంట్ లో అడుగుపెట్టేలా లేవు. రెండు ఇడ్లీ రూ. 90 లతో మొదలై సాయంత్రం తినే మిరపకాయ బజ్జీలు ప్లేట్ వచ్చి రూ.125.. ఇక ఇక ఒక కప్ టీ వచ్చి రూ. 80 లు అంట.. ఇక ఈ మెనూ చూసిన నెటిజన్లు ఈ డబ్బుతో వారం రోజులు తినొచ్చు.. బ్యాచిలర్స్ అయితే రెండువారాలు టీ తాగొచ్చు. మరీ ఇంత కాస్ట్ ఏంటి.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఇది కేవలం డబ్బున్నవారి కోసం మాత్రమే అని, మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళేది కాదని చెప్పుకొస్తున్నారు.