Site icon NTV Telugu

వివాదాల స్వామితో పూజలు చేసిన రష్మిక.. అందుకోసమేనా..?

rashmika

rashmika

‘పుష్ప’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది రష్మిక మందన్నా. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఇంట్లో పూజలు చేయించింది. అయితే ఈ పూజలకు కారణం ఏంటీ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చిత్ర పరిశ్రమలో వివాదాల స్వామిగా పేరుతెచ్చుకున్న వేణు స్వామి ఈ పూజలు చేయించినట్లు తెలుస్తోంది. వేణుస్వామి.. సమంత – నాగ చైతన్య విడాకులు అవుతాయని సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

https://ntvtelugu.com/shannu-deepti-breakup/

ఇక తాజాగా రష్మిక ఇంట్లో వేణుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించాడట. రష్మిక ప్రత్యేక పూజలు కెరీర్ కా.. లేక పెళ్లికా.. అన్నది మాత్రం తెలియాల్సి వుంది. ఈ విషయమై రష్మిక ఇప్పటివరకు నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ఈ పూజల విషయం తెలుసుకున్న నెటిజన్స్ .. హిట్లు అందాలని పూజ చేస్తున్నావా .. అవకాశాలు రావాలని పూజ చేయిస్తున్నావా ..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version