తెలుగు లో తక్కువ సినిమా లే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ సినిమా బద్రి తో తెలుగు లో మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ తరువాత మహేష్ తో నాని సినిమా మరియు ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమా లో నటించిన కూడా ఈ హీరోయిన్ ఆశించిన స్థాయి లో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయింది.బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ కి మంచి విజయాలే దక్కాయి. అయితే తాజాగా అమీషా పటేల్ చేసిన ఒక పని మాత్రం కొంత వివాదంగా మారింది.కొన్నిరోజుల క్రితం కృతిసనన్ చెంప పై ఓం రౌత్ ముద్దు పెట్టడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ విషయం మరిచిపోక ముందే ఇదే తరహాలో మరో ఘటన జరగడం విశేషం . ప్రస్తుతం గదర్2 అనే సినిమా లో అమీషా పటేల్ నటిస్తున్నారు. ఈ సినిమా లో సిక్కుల పవిత్ర స్థలం అయిన గురుద్వారా లో కొన్ని సన్నివేశాల షూటింగ్ జరిగినట్టు తెలుస్తుంది.. ఆ సీన్ల లో ముద్దు సన్నివేశాల తో పాటు కౌగిలింతలకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి.
అయితే ఈ సన్నివేశాల విషయం లో సిక్కు మతస్థులు బాగా సీరియస్ అవుతున్నారు. ఈ నటీనటులకు కొంచెమైనా బుద్ధి, జ్ఞానం లేదా అని కామెంట్లు కూడా చేస్తున్నారు.. గురుద్వారా నిర్వాహకులు ఈ ఘటన విషయం లో చాలా సీరియస్ అవుతుండగా చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో మరీ చూడాలి.దేవుడిని నమస్కరించే సీన్ షూట్ చేస్తామని చెప్పి చిత్రయూనిట్ అనుమతులు తీసుకుందని గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్ మరియు సెక్రటరీ శివ కన్వర్ సింగ్ వెల్లడించినట్లు సమాచారం..నెగిటివ్ కామెంట్ల విషయం లో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.అమీషా పటేల్ వివరణ ఇవ్వడం లేదా క్షమాపణలు చెబితే బాగుంటుందని కొంతమంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. .