Neru OTT streaming details: జీతూ జోసెఫ్… ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియక పోవచ్చు కానీ.. దృశ్యం డైరెక్టర్ అనగానే గుర్తు పట్టేస్తారు. ఇక దృశ్యం, దృశ్యం 2 వంటి చిత్రాలు తెరకెక్కించిన ఈ డైరెక్టర్.. ఇటీవల మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ తో కోర్డు డ్రామా నేరు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 21న మలయంలో రిలీజ్ అయింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. మోహన్ లాల్, ప్రియమణి, అనస్వర రాజన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద సలార్, డంకీ చిత్రాలు ఉన్నప్పటికీ.. మలయాళంలో ఈ సినిమా డామినేట్ చేసి.. సూపర్ హిట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకుంది.
Krishnam Raju: మొగల్తూరులో రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి వేడుకలు.. ఫ్రీ మెడికల్ కాంప్
ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అయింది. జనవరి 23న ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతుంది. అయితే ఈ సినిమా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా విషయంలో నిరాశే మిగిలింది. దానికి కారణం వెంకటేష్. ఇప్పటికే జీతు జోసఫ్ – మోహన్ లాల్ కాంబోలో వచ్చిన దృశ్యం సిరీస్ ను వెంకటేష్ తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు నేరు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామని వెంకటేష్ అనుకున్నారని సమాచారం. అందుకే తెలుగులో నేరు చిత్రాన్ని రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో రిలీజ్ అయ్యే వరకు తెలియదు.