ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ముందు మాస్ హీరోగా నిలబడాలని రామ్ పోతినేని, మాస్ సినిమా చేయాలి అంటే నా తర్వాతే అని నిరూపించాలని బోయపాటి శ్రీను ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన స్కంద టీజర్ లో ఈ హీరో-డైరెక్టర్ చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. రామ్ పోతినేని పర్ఫెక్ట్ బోయపాటి హీరోలా మారిపోయి కొత్తగా కనిపిస్తున్నాడు. టీజర్ కి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి శ్రీను, రామ్ పోతినేనిలతో ఇప్పటికే వర్క్ చేసి సూపర్బ్ ఆల్బమ్స్ ఇచ్చిన థమన్, మరోసారి స్కంద మూవీకి సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చినట్లు ఉన్నాడు.
ఆగస్టు 3న ఉదయం 9:36 “నీ చుట్టూ చుట్టూ” సాంగ్ బయటకి రానుంది. ఈ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేసారు. రామ్ పోతినేని ఎలాంటి డాన్సర్ అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డాన్సర్స్ లో రామ్ పోతినేని ఒకడు. అలాంటి రామ్ పోతినేనికి శ్రీలీలా లాంటి యంగ్ సెన్సేషన్, డాన్సింగ్ బాంబ్ కూడా కలిస్తే ఎలా ఉంటుందో ప్రోమోలో శాంపిల్ గా చూపించారు. ధమాకా సినిమాలో తన డాన్స్ తో యూత్ ని మాయ చేసిన శ్రీలీలా మరోసారి నీ చుట్టూ చుట్టూ సాంగ్ లో రెచ్చిపోయి డాన్స్ చేసినట్లు ఉంది. ఇద్దరు టెర్రిఫిక్ డాన్సర్స్ కలిసి థమన్ థంపింగ్ సాంగ్ కి డాన్స్ చేస్తే థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ చేసే అల్లరి దెబ్బకి తెరలు చిరిగిపోవడం ఖాయం. మరి 48 గంటల్లో రిలీజ్ కానున్న ఫుల్ లిరికల్ సాంగ్ మధ్యలో ఏమైనా డాన్స్ గ్లిమ్ప్స్ ని గిఫ్ట్ గా ఇస్తారేమో చూడాలి.
Ustaad @ramsayz & @SreeLeela14 Killer Moves will set the dance floor on fire 🔥🕺💃
Here's the Stylish Energetic promo of#NeeChuttuChuttu – https://t.co/5cOq3vE8RF#MainPeechePeeche – https://t.co/yoxcixMleZ#OnaSuthiSuthi – https://t.co/rxkBs334Sv#NinSutthaSuttha -… pic.twitter.com/vNhQXdHmFX
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 1, 2023