‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ ఈ రెండు కన్నడ సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో హీరో యష్ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుని పెద్ద స్టార్ అయ్యాడు. గట్టిగా చెప్పాలి అంటే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీగా మార్కెట్ సంపాదించుకున్న సౌత్ హీరోల్లో యష్ ఒకడు. దీంతో యష్ తర్వాతి చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకుని యశ్ ఆచితూచి అడుగులు వేశారు. అందుకే కొత్త చిత్రాన్ని ఓకే చేయడానికి.. దాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సమయం తీసుకున్నారు.
కాగా యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిస్’. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నటినటుల గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. విలన్ పాత్రలో ఇప్పటికే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ని ఓకే చేయగా. ఓ ఇంటర్వ్యూలో భాగంగా వివేక్ ఈ మూవీ లోకి హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టాడు. ‘ప్రస్తుతం యశ్ సినిమా షూటింగ్‌లో ఉన్న. ఈ చిత్రంలో నయనతార నటిస్తోంది, ఇంతకు మించి వివరాలు నేను వెల్లడించలేను త్వరలోనే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఓ ప్రకటన చేస్తారు’ అని వివేక్ తెలిపాడు. దీంతో ఈ మూవీలో నయన భాగం కానుందని తెలుస్తోంది.
ఇక సమాచారం ప్రకారం ఇప్పటికె హీరోయిన్‌గా ఉన్న కియార తో రెండు కీలక షెడ్యూల్స్ షూట్ చేసిందట చిత్ర యూనిట్. మరి హీరోయిన్ నయనతార ఈ మూవీలో ఎలాంటి పాత్రలో దర్శనమిస్తుందో చూడాలి. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ ఏడాది సమ్మర్ రిలీజ్ దశగా షూటింగ్ జరుగుతుందట. మరి అనుకున్న టైంకి పూర్తి చేస్తారో లేక మరో వాయిదా వేస్తారో చూడాలి.