Nayanthara is more active in Social Media in tense of Rumors: ఒక న్యూస్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నయనతార అతి తక్కువ సమయంలోనే మలయాళ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో క్లిక్ కావడంతో ఆమెకి తమిళంలో వరుస అవకాశాలు వచ్చాయి. తమిళంలో స్టార్ హీరోల సరసన నటించి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే ముందు నుంచి ఆమె పలువురు హీరోలతో నడిపిన ప్రేమాయణం గురించి ఎక్కువగా వార్తల్లో ఉంటూ వచ్చేది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ వచ్చింది. అంతేకాదు ఒకసారి సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రమోషన్స్ లో కూడా పెద్దగా కనిపించేది కాదు. అలాంటి ఆమె సోషల్ మీడియాలో సైతం చాలా వ్యూహాత్మకంగా సైలెంట్ గా ఉంటూ వచ్చేది.
Tollywood Shooting Updates: హైదరాబాదులో చిరు, ప్రభాస్, బన్నీ.. అవుట్ డోర్ వెళ్లిన ఎన్టీఆర్, రవితేజ!
కానీ ఈ మధ్య పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. కొన్నాళ్ల క్రితం తన భర్తతో విభేదాలు రావడంతో నయనతార విడాకులు తీసుకుంటుంది అంటూ ఒక వార్త పుట్టుకొచ్చింది. ఇక ఆ దెబ్బతో అప్పటి నుంచి తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు, పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడానికి ఆమె ఆసక్తి చూపిస్తోంది. కెరియర్ మొదటి నుంచి కనీసం ప్రమోషన్స్ లో పాల్గొనడానికి కూడా ఆమెను నిర్మాతలు రప్పించలేక పోయేవారు కానీ సోషల్ మీడియా నెటిజన్లు మాత్రం ఆమెను ఒక రేంజ్ లో భయపెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేలా చేస్తున్నారు అనే కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి నయనతార పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులలో భాగమైంది. తన పిల్లలు, భర్తతో క్వాలిటీ టైం గడిపేందుకు ప్రయత్నిస్తోంది.