Tollywood Shooting Updates on April 15th 2024: తెలుగు సినిమా హీరోలందరూ షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఒకపక్క ఎండలు దంచికొడుతున్నా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తమ సినిమాల షూటింగ్స్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి చిరంజీవి మొదలు మిగతా ఇతర హీరోలందరూ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఆ షూటింగ్స్ ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? అనే విషయం మీద ఒకసారి లుక్ వేద్దాం. మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లో జరుగుతోంది. ప్రభాస్ నాగ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు శంకర్ పల్లిలో జరుగుతోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ల వార్ 2 సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతోంది. రవితేజ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ లక్నో లో జరుగుతోంది.
ఈ శుక్రవారం థియేటర్లో రిలీజవుతున్న 6 సినిమాలు ఇవే
నితిన్ వెంకీ కుడుముల సినిమా రాబిన్ హుడ్ షూటింగ్ మోయినా బాద్ లో హైదరాబాద్ శివారు జరుగుతోంది. మ్యాడ్ 2 సినిమా మ్యాడ్ మాక్స్ షూటింగ్ రెండ్రోజులుగా గుంటూరు కారం హౌస్ లో షూట్ జరుగుతోంది. ఈరోజు కూడా అదే సెట్ లో షూట్ చేస్తున్నారు. నాగ చైతన్య చందు మొండేటి డైరెక్షన్ లో నటిస్తున్న తండేల్ సినిమా షూటింగ్ బీహెచ్ఈఎల్ లో వేసిన స్పెషల్ సెట్లో జరుగుతోంది. గోపీచంద్ శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. శర్వానంద్ సామజవరాగమనా రామ్ అబ్బరాజు కాంబో లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ మణికొండ డాలర్ హిల్స్ లో జరుగుతోంది. మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇవండీ షూటింగ్ అప్డేట్స్.