Naveen Polishetty: మహానటి సినిమాలో కనుక సావిత్రి.. భవిష్యత్తులో ఈ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది అని జెమినీ గణేశన్ అన్నట్లు.. ప్రస్తుతం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా నుంచి బయటకు వచ్చినవారందరు కూడా నవీన్ పోలిశెట్టి పేరు భవిష్యత్తులో చాలా గట్టిగా వినిపిస్తుంది అని చెప్పుకొస్తున్నారు. ఎటువంటి బ్యాక్ డ్రాప్ లేకుండా కెరీర్ మొదలుపెట్టాడు నవీన్ పోలిశెట్టి. ఎన్నో అవమానాలు.. ఎదురుదెబ్బలు.. ఆడిషన్స్ కు వెళ్లి సెలెక్ట్ అయినా రిఫరెన్స్ లు లేక.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ .. హీరోగా ఎదిగిన నవీన్ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం. ఇక ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమా అప్పుడు.. ఎవరో కొత్త కుర్రాడు.. యూట్యూబ్ వీడియోలు చేస్తాడట.. మహేష్ బాబు సినిమాలో ఒక చిన్న పాత్రలో చేశాడట అని మాట్లాడుకున్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకొని నవీన్ అంటే ఎవరు అని టాలీవుడ్ కు తెలిసేలా చేసింది. అంతేనా ఒకే ఒక్క సినిమాతో.. నవీన్ వెళ్లి వైజయంతీ మూవీస్ బ్యానర్ లో పడ్డాడు. ఇక జాతిరత్నాలు సినిమాతో దేశాన్ని మొత్తం ఒక ఊపు ఆపేశాడు ఈ కుర్రాడు.
Minister RK Roja: చంద్రబాబుది మాటల ప్రభుత్వం.. జగన్ మోహన్ రెడ్డిది చేతల ప్రభుత్వం
సిద్దిపేట కుర్రాడిగా మనోడి యాక్టింగ్, కామెడీ వేరే లెవెల్ అంతే. ఇక ఈ సినిమాతో నవీన్.. స్టార్ హీరోగా మారిపోయాడు. రెండు సినిమాల తరువాత నవీన్ నుంచి వచ్చేహ్ మూడో సినిమా ఎలా ఉండబోతుంది అని అభిమానులు ఎంతో ఆసక్తికాగా ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులు నేడు సమాధానం దొరికింది మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నవీన్ వన్ మ్యాన్ షో అని అంటున్నారు.. ఎంత స్వీటీ ఫ్యాన్స్ అయినా కూడా ఆమెకన్నా.. నవీన్ యాక్టింగ్ నే ఎక్కువ చూశారు అంటే అతిశయోక్తి లేదు. స్టాండప్ కమెడియన్ గా.. హీరోయిన్ ప్రేమకోసం పడే పాట్లు.. కన్ఫ్యూజన్ మైండ్ తో కామెడీ చేయడం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకొస్తున్నారు. నవీన్ టాలెంట్ చాన్నాళ్ల పాటు వేస్ట్ అయిపోయిందే అన్న ఫీలింగ్ అభిమానుల్లో కలుగుతుందట. ఇక ఈ సినిమా చూశాక .. ఫ్యాన్స్ అందరు చెప్పే ఒక్కే మాట ఫ్యూచర్ సూపర్ స్టార్ అని.. రాసుకోండి కావాలంటే అని కూడా ఫ్యాన్స్ ఛాలెంజ్ విసురుతున్నారు. మరి ఫ్యాన్స్ ఆశలను నవీన్నెరవేరుస్తాడా.. ? లేదా ..? చూడాలి.