Naveen Chandra: అందాల రాక్షసి చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. మొదటి సినిమాతోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర .. ఆ తరువాత పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఇక హీరోగా అవకాశాలు వచ్చినా.. విజయాలు దక్కకపోయేసరికి విలన్ గా మారాడు. అరవింద సమేత.. నవీన్ చంద్ర కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఎన్టీఆర్ కు విలన్ గా జగపతి బాబు ఎంత అయితే విలనిజాన్ని పండించాడో.. నవీన్ సైతం .. అంత విలనిజాన్ని చూపించి అలరించాడు. ఈ సినిమా తరువాత నవీన్ కు విలన్ రోల్స్ ఎక్కువగా రావడమే కాకుండా మంచి విజయాలు కూడా వచ్చాయి. ఇక తాజాగా నవీన్ చంద్ర నటిస్తున్న చిత్రం మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ నాగోటు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర సరసన కలర్స్ స్వాతి నటించింది. పెళ్లి తరువాత స్వాతి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక రీ ఎంట్రీలో చిన్న చిన్న సినిమాలు చేస్తూ.. ఒక మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Kapildev: బ్రేకింగ్.. కెప్టెన్ కపిల్ దేవ్ కిడ్నాప్.. వీడియో వైరల్
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం.. సినిమా విషయాలతో పాటు.. వ్యక్తిగత విషయాలను కూడా బయటపెడుతున్నారు. నవీన్ చంద్ర, స్వాతి ఇప్పటికే త్రిపుర అనే సినిమాలోనటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా సమయంలోనే స్వాతి, నవీన్ చంద్ర పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇన్నాళ్లకు ఆ వార్తలపై నవీన్ స్పందించాడు. ” మేము ఆ సినిమాచేస్తున్న సమయంలో సెట్ నుంచి మేమిద్దరం పెళ్లి బట్టలో ఉన్న ఒక ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. అది చూసి అందరూ మేము నిజంగా పెళ్లి చేసుకున్నాం అనుకున్నారు. ఆ తరువాత అదే పోస్టర్ ను త్రిపుర ఫస్ట్ లుక్ పోస్టర్ గా రిలీజ్ చేశారు. దీంతో చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. మరికొంతమంది కాల్ చేసి.. నిజంగా మీరు పెళ్లి చేసుకున్నారని అనుకున్నాం అని చెప్పుకొచ్చారు. ఆ వార్తలు చూసి నేను, స్వాతి నవ్వుకున్నాం” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో స్వాతి గట్టి కమ్ బ్యాక్ ఇస్తుందా.. ? నవీన్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంటాడా.. ? అనేది చూడాలి.