అనుష్క…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అద్భుతమైన నటన తో టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. కానీ ఆ సినిమా తరువాత సినిమాలలో కనిపించడమే మానేసింది అనుష్క. అనుష్క అభిమానులు మాత్రం ఆమె మరో భారీ సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు.బాహుబలి వంటి భారీ హిట్ వున్నా అనుష్క స్టార్ హీరోల సినిమాల లో ఆఫర్ తెచ్చుకోలేకపోయింది. అయితే ఆమె లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి.
ఈ సినిమా ను యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా మహేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమా లో అనుష్క కు జోడి గా నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడు.అలాగే నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తను చేసిన రెండు సినిమాలు కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి..జాతి రత్నాలు సినిమా నవీన్ కెరీర్ ను మార్చేసింది అని చెప్పాలి. ఇప్పుడు నవీన్ చేస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమా పై మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు వంటి సినిమాల లో నవీన్ పొలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు.ఇక లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తో కూడా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ను అందించనున్నాడు.స్టార్ హీరోయిన్ అనుష్క తో నవీన్ సినిమా చేస్తున్నాడన్న విషయం పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయింది.. సినిమాలో అనుష్కతో నవీన్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయా అని ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ . అయితే ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కనుక తప్పకుండా ఒకటి రెండు డ్యూయెట్ సాంగ్స్ కి ఉండే అవకాశం ఉంది.మరి మరి ఆ సీన్స్ లో నవీన్ ఎలా చేశాడన్నది ఇప్పుడు ఆసక్తికరం గా మారింది.