Site icon NTV Telugu

Navdeep : నవదీప్ ఇమేజ్ డ్యామేజ్.. అనవసరంగా జడ్జిగా వెళ్లాడా..?

Navdeep

Navdeep

Navdeep : హీరో నవదీప్ కు సినిమాల్లో మంచి పేరుంది. నటుడిగా బోలెడన్ని అవకాశాలు వస్తాయి. హీరోగా కాకపోయినా సినిమాల్లో పాత్రలు చేయాలనుకుంటే లెక్కలేనన్ని అవకాశాలు ఉంటాయి అతనికి. అలాంటి నవదీప్ బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ కు జడ్జిగా వెళ్లాడు. అక్కడ సామాన్యులను బిగ్ బాస్ షోకు పంపేందుకు ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలిపే స్థాయిలో నవదీప్ ఉన్నాడు. అక్కడే అసలు సమస్య వచ్చింది. సామాన్యులపై నవదీప్ కొన్ని సార్లు బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వ్యవహరించిన తీరు అతనికి తీవ్ర విమర్శలు తెచ్చిపెడుతన్నాయి.

Read Also : Samantha – Raj Nidumoru : సమంత వీడియో.. రాజ్ నిడుమోరు భార్య షాకింగ్ పోస్ట్

ఆ మధ్య ఓ కంటెస్టెంట్ ను ఊరు నుంచి వచ్చావ్ నీకు అంత సీన్ లేదు అంటూ కామెంట్ చేయడం పెద్ద రచ్చకు దారి తీసింది. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే కాకుండా మరికొందరు కంటెస్టెంట్స్ విషయంలో ఇలా వ్యవహరించడంతో అతను అనవసరంగా ఈ ప్రోగ్రామ్ కు జడ్జిగా వచ్చాడంటూ ఆయన అభిమానులు అంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ షో వల్ల గానీ.. ఆ షోకు సంబంధించిన ప్రోగ్రామ్స్ లో పాల్గొంటే వచ్చే పేరు కన్నా విమర్శలే ఎక్కువగా ఉంటున్నాయనే విషయం తెలిసిందే. అందుకే నవదీప్ బుద్ధిగా సినిమాలు చేసుకోకుండా ఇందులోకి వచ్చి తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నాడని అంటున్నారు.

Read Also : Shilpa Shetty : హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులు

Exit mobile version