Nani: సీతమ్మకు బొట్టు పెడుతున్న రామయ్యలా ఉన్నావయ్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని.. అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని నాని కాస్తా.. న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. ఇక నాని స్టార్ హీరోగా మారాక.. 2012లో అక్టోబర్ 27న అంజనా ఎలవర్త ని వివాహమాడాడు. వీరిద్దరిది లవ్ మ్యారేజ్. అంజనా, నాని పరిచయం ఫేస్ బుక్ లో జరిగింది. అయిదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రస్తుతం అంజనా కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేస్తోంది. ఇక వీరికి జున్ను అనే కుమారుడు ఉన్నాడు. నేడు నాని, అంజనా 11 వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు.
Guntur Kaaram: డీఓపీ తొలగింపు.. అసలు నిజం చెప్పిన కొత్త డీఓపీ
Also Read
- Irumudi : 'ఇరుముడి' అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
- Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
- Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
ఇక నాని.. తన వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఒక అద్భుతమైన ఫోటోను షేర్ చేస్తూ.. భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఆ ఫోటోలో ఏదో పూజలో కూర్చున్న అంజన నుదుటిన కుంకుమ పెడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోపై నాని అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. సీతమ్మకు బొట్టు పెడుతున్న రామయ్యలా ఉన్నావయ్యా.. అని కొందరు.. సూపర్ పిక్ అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం నాని.. హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఇది కాకుండా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో నాని ఎలాంటి హిట్స్ అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!