మే నెల మొత్తం ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ వంతు వచ్చేసింది. మరో వారం రోజుల్లో సోషల్ మీడియాను హోరెత్తించడానికి రెడీ అవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. జూన్ 10 బాలయ్య బర్త్ డే ట్రీట్ ఓ రేంజ్‌లో ఉండబోతోంది. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో NBK 108 ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. వచ్చే దసరాకు రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య బర్త్ డే సందర్భంగా… NBK 108 టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఈ సినిమాకు ముందు నుంచి ‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ వినిపించింది. కానీ లేటెస్ట్‌గా పవర్ ఫుల్ టైటిల్ తెరపైకి వచ్చింది.
కథ ప్రకారం ఈ సినిమాకు ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నిజముందా? అనే డౌట్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఈ టైటిల్ పై సాలిడ్ క్లారిటీ వచ్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ ఈస్ట్ గోదావరీ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్‌లో ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ కనిపించడంతో ఈ టైటిల్ క్లారిటీ వచ్చేసినట్టేనని అంటున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో మైత్రి సంస్థ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో భగవత్ కేసరి గోదావరి ఏరియా డిస్ట్రిబ్యూషన్ మైత్రీ వారే చేస్తున్నారనే క్లారిటీ కూడా వచ్చేసింది అని అంటున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించనుంది.