Ramya Raghupathi: మళ్లీ పెళ్లి స్ట్రీమవుతున్న OTTలకు లీగల్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు నరేష్, పవిత్రా లోకేష్ ఇటీవల నటించిన మళ్లీ పెళ్లి సినిమాను వివాదాలు వదలడం లేదు. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నుంచే ఈ సినిమా మీద కేసులు నమోదు చేస్తూ వస్తోంది నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి. ఈ సినిమాలో చిత్రనిర్మాతలు తన పాత్రను చెడుగా చూపించారని నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా OTTలో ప్రసారం అవుతుండగా మరోసారి రమ్య వార్తల్లోకి వచ్చింది. తాజా సమాచారం మేరకు OTT ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో రెండింటిలో మళ్లీ పెళ్లి సినిమా విడుదలను నిరోధించాలని నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
Megastar: ఆరోజు వెయ్యి మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు.. చిరంజీవి కీలక ప్రకటన
ఈ కోర్టు సమస్య కారణంగా, ప్రైమ్ ఈ సినిమాను రిలీజ్ చేయలేదు, ఈ క్రమంలో ఆహా వీడియోలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మళ్లీ పెళ్లి, నరేష్, పవిత్ర, రమ్యల వ్యక్తిగత జీవితాలను ఆధారంగా చెసుకుని తీసిన సినిమానే అయినా నరేష్ మాత్రం ఈ సినిమాకి తమ జీవితాలకు ఎలాంటి సంబంధం లేదని, ఇదొక కల్పిత చిత్రమని ప్రకటించారు. నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమాకు ప్రముఖ నిర్మాత, ఈ మధ్యనే దర్శకుడుగా మారిన ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెలలో థియేటర్లలో విడుదలైంది, విమర్శకులు – ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. నరేష్, పవిత్రా లోకేశ్‌ల నిజ జీవితంలో జరిగిన సంఘటనల నుంచి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో జయసుధ, శరత్ బాబు, వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటించారు. సురేష్ బొబ్బిలి, అరుల్ దేవ్ సంగీతం అందించిన ఈ సినిమాను విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నటుడు నరేష్ నిర్మించారు.
Also Read
- Ravi Teja : ‘ఇరుముడి’ తర్వాత రవితేజ డబుల్ ట్రీట్..
- NTRNEEL : నందమూరి ఫ్యాన్స్‌కు మిడ్ నైట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
- Drishyam3 Telugu : దృశ్యం 3 తెలుగు ట్రైలర్ చూశారా.. జార్జికుట్టి పోలీసులకు దొరికేసాడా?
- Peddi : స్క్రీన్‌పై రామ్ చరణ్ కనిపించడు.. కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు: అనంత శ్రీరామ్
తాజావార్తలు
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
-
Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్‌ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
-
Ravi Teja : ‘ఇరుముడి’ తర్వాత రవితేజ డబుల్ ట్రీట్..
-
Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
-
NTRNEEL : నందమూరి ఫ్యాన్స్‌కు మిడ్ నైట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?