Vijay Binni : డైరెక్టర్ కావాలని వచ్చి కొరియోగ్రాఫర్ అయ్యా.. ‘నా సామిరంగ’ డైరెక్టర్ ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naa Saami Ranga Director Vijay Binni interview: కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా నటిస్తున్న ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమా గురించి దర్శకుడు విజయ్ బిన్ని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా ఎలా టర్న్ అయ్యారు ?
-దర్శకుడు కావాలనే పరిశ్రమలోకి వచ్చా. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చూసిన తర్వాత కొరియోగ్రాఫర్ కి అన్ని విభాగాల మీద గ్రిప్ ఉంటుందని భావించి కొరియోగ్రఫీ వైపు వెళ్లా.
Also Read
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
మీ తొలి సినిమా నాగార్జున లాంటి పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేయడం కష్టం అనిపించిందా ?
-ఇంతకుముందు నాగార్జున కి పాటలు చేశాను. సినిమా కూడా చాలా హ్యాపీ గా చేసుకుంటూ వెళ్లా. దర్శకుడిగా తొలి సినిమాని నాగార్జున తో చేయడం నా అదృష్టం.
కొరియోగ్రఫీ వేరు డైరెక్షన్ వేరు కదా.. ఈ రెండు చేయడం ఒత్తిడి అనిపించిందా ?
-లేదండీ. నాకు మొదటి నుంచి డైరెక్షన్ పైనే ఆసక్తి వుంది. కొరియోగ్రఫీ కూడా ఎక్కువ స్టోరీ టెల్లింగ్ వున్న పాటలు, మాంటేజస్ చేశా. సరైన సమయంలో ఈ అవకాశం వచ్చింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా అంతా సజావుగా జరిగింది.
ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
-ముందు నాగార్జున తో ఒక సినిమా చేయాలని ఆయనకి కథ చెప్పినప్పుడు ఆయన ఈ కథ గురించి చెప్పి ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయమని చెప్పారు. ఈ కథని వోన్ చేసుకొని నా స్టయిల్ లో చేశా. ఈ సినిమాలో చాలా హైస్ వుంటాయి. వింటేజ్ నాగార్జున కనిపిస్తారు. నేను నాగార్జునని ఎంత డిఫరెంట్ గా చూపించాలని అనుకున్నానో అంత కొత్తగా ప్రజెంట్ చేశానని భావిస్తున్నా.
అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రల గురించి ?
-ఇదొక ఫ్రెండ్షిప్ మూవీ. నరేష్ కి నాగార్జున గారంటే పిచ్చి. వారిద్దరిని ఈ కథలో పెడితే బాగుంటుందనిపించింది. నరేష్ అద్భుతంగా చేశారు, వీరితో పాటు మరో యంగ్ యాక్టర్ ఉండాలి. ఆ పాత్రకు రాజ్ తరుణ్ ని తీసుకున్నాం. ఇందులో ముగ్గురికి ఒకొక్క కథ ఉంటుంది. ఈ కథలు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? వాళ్ళ మధ్య జరిగిన సిస్ట్యువేషన్స్ ఏమిటనేది చాలా కొత్తగా వుంటాయి.
మీ వర్క్ పట్ల నాగార్జున ఎంత హ్యాపీగా ఉన్నారు ?
-నాగార్జున చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన ఎంతో మంది దర్శకులతో పని చేశారు. అందులో నా ప్రత్యేకత ఎమిటనేది నాగార్జున చెబితే బాగుంటుంది. ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తే సినిమాని ఎంత త్వరగా పూర్తి చేయొచ్చో ఈ సినిమాతో నేర్చుకున్నా. నాగార్జున , నరేష్ రాజ్ తరుణ్ అద్భుతంగా సపోర్ట్ చేశారు.
ఇందులో ఐటెం సాంగ్ సర్ ప్రైజ్ ఉందని విన్నాం ?
-చాలా సర్ప్రైజ్ లు వున్నాయి. అవన్నీ తెరపై చూడాల్సిందే
ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి చేసిన చిత్రమిది.. తొలి సినిమా దర్శకుడిగా ఆయనతో పని చేసిన మీ అనుభవం ?
-కీరవాణి చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడూ కొత్త దర్శకుడిలా చూడలేదు. నేను కొరియోగ్రఫర్ ని కాబట్టి మ్యూజిక్ సెన్స్ ఉంటుంది. ఆయనకి ఏదైనా చెప్పినా ఒక సెన్స్ తోనే చెబుతున్నాడని భావించేవారు. ఆయన సపోర్ట్ మర్చిపోలేను. ఇప్పటివరకూ వచ్చిన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. రాబోయే మూడు పాటలు కూడా వైరల్ అవుతాయి.
ఈ సినిమా నేపథ్యం ఏమిటి ?
-స్నేహం, మంచి ప్రేమకథ, చాలా మంచి ఎమోషన్ వుంటాయి. 80-90 మధ్య కాలంలో జరిగే కథ ఇది.
నా సామిరంగ టైటిల్ ఆలోచన ఎవరిది ?
-నా సామిరంగా ఏఎన్ఆర్ సినిమాలో ప్రజాదరణ పొందిన పాట. అది టైటిల్ అయితే బావుంటుందని అందరం కలసి తీసుకున్న నిర్ణయం ఇది.
ఈ సినిమా కోసం చాలా ఫాస్ట్ గా పని చేశారు కదా.. ఎక్కడ ఒత్తిడి అనిపించలేదా ?
-డైరెక్టర్ కావడం నా డ్రీం. ఆ డ్రీం కోసం చాలా కష్టపడ్డా. సరైన సమయంలో ఈ చిత్రం వచ్చింది. దీనికి నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. కమర్షియల్ లోనే నా సొంత స్టైల్ ని ప్రయత్నించా. అది ఖచ్చితంగా యూనిక్ గా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చుతుంది.
నిర్మాతల గురించి ?
-నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. కావాల్సిన ప్రతిది సమకూర్చారు. అందుకే ఇంత సజావుగా సినిమా జరిగింది.
ఇందులో కొరియోగ్రఫీ మీరే చేశారా ?
నాలుగు పాటలకు నేను చేశా. ఒక పాట విజయ్, మరో పాట దినేష్ మాస్టర్ చేశారు.
ఎలాంటి జోనర్ సినిమాలు చేయాలని అనుకుంటారు?
అన్ని జోనర్ సినిమాలు చేయాలని వుంది.
తాజావార్తలు
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!