Nara Rohith : నారా రోహిత్ ఈ మధ్య ట్రెండింగ్ లోకి వస్తున్నాడు. ఆయన గురించి ఓ కాంట్రవర్సీ వైరల్ అవుతోంది. వార్-2 సినిమా చూడొద్దని చెప్పాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిపై తాజాగా ఆయన స్పందించారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సుందరకాండ ఆగస్టు 27న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఈ కాంట్రవర్సీపై మాట్లాడుతూ.. వార్-2 ఇష్యూ ఆడియో నా దృష్టికి వచ్చింది. కానీ నేను ఆడియో వినలేదు. దాని గురించి స్పందించాలని అనుకోవట్లేదు. ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మంచి కథ దొరికితే తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తాను.
Read Also : Chiranjeevi – Pawan Kalyan : అప్పుడు పవన్ కల్యాణ్.. ఇప్పుడు చిరంజీవి.. అదే సీన్ రిపీట్..
రాజకీయాల్లోకి తప్పకుండా వెళ్తాను. ఎప్పుడు రాజకీయాల్లోకి వెళ్లాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దానిపై టైమ్ వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తాను. సుందరకాండ కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. ఈ మూవీలో లవ్ తో పాటు మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నా సినిమాలను చంద్రబాబు నాయుడు, లోకేష్ కచ్చితంగా చూస్తారు. వారికి ఈ మూవీని చూపిస్తాను అంటూ తెలిపాడు నారా రోహిత్. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రోహిత్ ఎన్టీఆర్ గురించి పాజిటివ్ గానే మాట్లాడాడు కాబట్టి ఈ రచ్చ ఇక్కడితో ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Dharma Wife Gauthami : లేడీ డాక్టర్ నా భర్త ఒడిలో కూర్చుని రాత్రంతా.. హీరో ధర్మ భార్య ఆరోపణలు
