Nara Rohith : నారా రోహిత్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఆయన నటించిన సుందరకాండ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్ లో ఆయన ఏపీలో వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఏపీలోని చాలా ప్రాంతాలకు ఆయన తిరుగుతున్నారు. అక్కడ ప్రేక్షకులను కలిసి మూవీ విశేషాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా వినాయకుడి దర్శనాలు కూడా చేసుకుంటున్నారు. ఆయన తాజాగా వినాయకుడి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మూవీ గురించి అనేక విశేషాలను పంచుకున్నాడు.
Read Also : Nani : అది తలచుకుంటే నరకంలా అనిపిస్తోంది.. నాని షాకింగ్ కామెంట్స్
చాలా రోజుల తర్వాత మూవీతో ప్రేక్షకులను మెప్పించడం సంతోషంగా ఉంది. అందరి నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రేక్షకుల నుంచి ఇలాంటి రెస్పాన్స్ కోసమే వెయిట్ చేశాను అని తెలిపారు. సినిమా హిట్ అయింది కదా.. మరి వ్యక్తిగత జీవితంలో పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా.. అక్టోబర్ ఎండింగ్ లో లేదా నవంబర్ మొదటి వారంలోనే నా పెళ్లి ఉంటుంది అన్నాడు రోహిత్. మనకు తెలిసిందే కదా శిరీషతో రోహిత్ ఎంగేజ్ మెంట్ అయింది. ఆ తర్వాత రోహిత్ తండ్రి చనిపోవడంతో పెళ్లి వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు అన్నీ కుదరడంతో పెళ్లికి రెడీ అవుతున్నాడు.
Read Also : Anushka : అనుష్క వాళ్లకు భయపడి బయటకు రావట్లేదా..?
