Diwali Special : జగపతిబాబు షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్.. డబుల్ ధమాకా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నిత్యం ప్రజాక్షేత్రంలో బిజీగా ఉండే నారా లోకేశ్ తొలిసారిగా బుల్లితెరపై వినోదాత్మక వేదికను పంచుకోనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న షోకి ఆయన ప్రత్యేక అతిథిగా రావడం ఇప్పుడు సర్వత్రా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీపావళి పండుగ వారాంతం సందర్భంగా ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని వినోదాన్ని అందించేందుకు జీ తెలుగు ఈ అదిరిపోయే ప్లాన్ చేసింది. ఒకవైపు పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కాంబో.. మరోవైపు బుల్లితెర తారల తళుకులతో కూడిన అవార్డుల వేడుకతో వీక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వడానికి సిద్ధమైంది. నవంబర్ 8 (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు ప్రసారం కానున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’ ఎపిసోడ్ ఈ దీపావళికి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవనుంది. విలక్షణ నటుడు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ వేదికపై మంత్రి నారా లోకేశ్ సందడి చేయనున్నారు. తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన, ఎవరికీ తెలియని విషయాలను ఆయన జగపతిబాబుతో పంచుకోనున్నారు.
దీని కంటే ముందుగా, నవంబర్ 7 శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రేక్షకుల ఆరాధ్య వేడుక ‘జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’ గ్రాండ్‌గా ప్రసారం కానుంది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేయనున్న ఈ కార్యక్రమం.. టెలివిజన్ రంగంలో ఆమె 25 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేకమైన ఇంట్రడక్షన్‌తో ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఈ అవార్డుల పండుగకు సినీ తారలు బాబు మోహన్, లయ, రాజీవ్ కనకాల, శివబాలాజీ, బ్రహ్మాజీ, నివేదా పేతురాజ్, మధుమిత, బాబా భాస్కర్, గెహనా సిప్పీ, మానస వారణాసి తదితరులు హాజరై సందడి చేయనున్నారు. మధ్యాహ్నం మహానాయకుడు, ఐకానిక్ కపుల్, లవర్ బాయ్, సూపర్ క్వీన్, పాపులర్ ఫేస్ ఆఫ్ ప్రైమ్ టైమ్ ఫిమేల్, ఉత్తమ కథానాయకుడు, నవనాయకి, ఉత్తమ కోడలు, తెలుగు అమ్మాయి తదితర విభాగాల్లో బుల్లితెర నటీనటులకు అవార్డుల ప్రదానం జరగనుంది.
Also Read
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. ఎస్ఈసీ కీలక ప్రకటన..
-
Vallabhaneni Vamsi: పక్షపాతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. వల్లభనేని ఫైర్
-
Ramayana : ‘రామాయణ’ మొదలైందిలా… ముగింపులో మిగిలింది ఎవరు?
-
SS Rajamouli Reviews Ramayana: ‘రామాయణ’పై రాజమౌళి రివ్యూ వైరల్! ఏమన్నారంటే?
-
Ramayana : రణబీర్‌ను డామినేట్ చేసిన యష్
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!