The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదేలా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రత్యేకించి ట్రైలర్‌తో సంబంధం లేకుండానే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.
ముఖ్యంగా నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 40 కోట్ల మార్కును దాటేశాయి. నాన్-థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు రూ. 65 కోట్ల భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ నాని కెరీర్లోనే అత్యధికంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 75 కోట్లకు పైగా అమ్ముడవగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ. 100 కోట్ల మేర జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల నెట్ లేదా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న క్రేజ్ ని బట్టి చూస్తే డే 1 రూ. 50 కోట్లు గ్రాస్ మార్క్ టచ్ అయ్యే సుచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే నాని కెరీర్ ఇదే హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. మరి ప్యారడైజ్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.
Also Read
- Varanasi : 'వారణాసి'లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!