Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani: న్యాచురల్ స్టార్ నాని కేవలం హీరోగానే కాకుండా తనదైన కథల ఎంపికతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పరిశ్రమలోకి నటుడిగా అడుగుపెట్టడానికి ముందే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలోనే ఆయన స్వయంగా ఒక పవర్ఫుల్ యాక్షన్ స్టోరీని సిద్ధం చేసుకున్నారనే ఆసక్తికర విషయాన్ని తాజాగా బయటపెట్టారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని, కయాదు లోహర్ జంటగా నటించిన ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్ల సందర్భంగా జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నాని తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లోనే సొంతంగా ఒక పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్ రాసుకున్నానని వెల్లడించారు. అంతేకాకుండా ఆ కథకు ‘24’ అనే టైటిల్‌ను కూడా అప్పట్లోనే ఫిక్స్ చేసినట్లు పేర్కొన్నారు. “ఆ స్క్రిప్ట్ మొత్తం నా దగ్గరే భద్రంగా ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ కథతో దాన్ని సిద్ధం చేసుకున్నాను” అని నాని అన్నారు. ‘రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నాని’గా ఎప్పుడైనా ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తారా అనే ప్రస్తావన రాగా, ఇప్పుడు కాదని, నిజంగా ఆ స్క్రిప్ట్ ఎవరైనా ఫిల్మ్ మేకర్‌కి నచ్చి చేస్తానంటే చాలా బాగుంటుందని అన్నారు. ‘నేను 18 ఏళ్లప్పుడు రాసుకున్న ఆ స్టోరీని ఇప్పుడు కొన్ని మార్పులు చేసి వాడుకోవచ్చు’ అని వెల్లడించారు. ప్రస్తుతం తన డైరెక్షన్లో ఆ సినిమా గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. నాని కథ రాసిపెట్టుకున్న విషయం తెలియడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎప్పటికైనా నాని మెగాఫోన్ పట్టి ఆ ‘24’ కథను తెరపైకి తీసుకొస్తే చూడాలని సినీ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.
Also Read
- Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
- Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
- Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
తాజావార్తలు
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!