Nani 31: అంటే వివేక్ ఆత్రేయతో నానీ నెక్స్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెంటల్ మదిలో సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు వివేక్ ఆత్రేయ. రెండో సినిమా బ్రోచేవారెవరురా ఆల్మోస్ట్ ఒక మోడరన్ క్లాసిక్ ని అందించాడు. ఇక మూడో సినిమా నానితో ‘అంటే సుందరానికి’ అంటూ చేసిన వివేక్ ఆత్రేయ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ని మెప్పించాడు కానీ ముందు రెండు సినిమాల్లాగా క్లీన్ హిట్ కొట్టలేకపోయాడు. కొంతమంది అంటే సుందరిని సినిమాని క్లాసిక్ అంటారు, ఇంకొంతమంది బాగోలేదు అంటారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా… అంటే సుందరానికి సినిమాలో నాని కామెడీ టైమింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్ మరోసారి సెట్ అయ్యింది. డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న నాని, నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ‘అంటే సుందరానికి’ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ… వివేక్ ఆత్రేయతో నాని సినిమాని అనౌన్స్ చేసాడు. చాలా రోజులుగా వినిపిస్తున్న ఈ కాంబినేషన్ ఈరోజు అఫీషియల్ గా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది.
డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నాని కెరీర్లో 31వ చిత్రంగా రాబోతుంది. #Nani31 ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ అనౌన్సమెంట్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని కొత్త సరికొత్త లుక్‌లోకి రాబోతున్నట్టుగా చూపించారు. అక్టోబర్ 24న ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం… ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది. ఇంతకుముందు ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ లాంటి వెరైటీ టైటిల్స్ పెట్టిన వివేక్ ఆత్రేయ… నాని31 సినిమాకు కూడా డిఫరెంట్ టైటిల్ లాక్ చేశాడట. ఈ సినిమాకు ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఇక హీరోయిన్గా ప్రియాంకా అరుల్ మోహన్ ఫిక్స్ అయిందని సమాచారం. డివివి దానయ్య నిర్మిస్తున్న పవన్ ‘ఓజీ’ మూవీలో కూడా ఆమెనే హీరోయిన్. అందుకే.. నాని సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. గతంలో ఈ బ్యూటీ నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలోను నటించింది. మరి ఈసారైనా నాని, వివేక్ ఆత్రేయ్ హిట్ కొడతారేమో చూడాలి.
Also Read
- Peddi : భారీ నష్టాల దిశగా 'పెద్ది' నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
- Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి... ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
- NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
- Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య... ఈసారి ఏమైందంటే ?
#Nani31 it is… 🔥🔥
The most lovable combo of our Natural Star @NameisNani & #VivekAthreya is back. ❤️🤗
UNCHAINED on Oct 23rd.
Muhurtham is on Oct 24th.Get ready to witness thrills, chills, and fun. pic.twitter.com/e4ZhM0yWyx
— DVV Entertainment (@DVVMovies) October 21, 2023
తాజావార్తలు
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ben Stokes: చిరకాల సలహాదారుడిని కలుస్తున్న బెన్ స్టోక్స్.. బయపడిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు!
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!